శతఘటాభిషేకం

- యాదాద్రిలో వైభవంగా స్వాతినక్షత్ర పూజలు
- స్వామివారికి లక్ష పుష్పార్చన.. అమ్మవారికి ఊంజల్‌సేవ..
- తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంటల పాటు శ్రీవారి అష్టోత్తర శతఘటాభిషేకం కనుల పండువగా నిర్వహించారు. కార్తికమాసంచివరి శుక్రవారం కావడంతో భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి.
ఆలేరు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొన్నది. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంటల పాటు శ్రీవారి అష్టోత్తర శతఘటాభిషేకం కనుల పండువగా నిర్వహించారు. కార్తికమాసం చివరి శుక్రవారం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి జనం రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. బాలాలయం ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీఅర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖమండపంలో భక్తులను అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతు నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి.
స్వామివారికి లక్ష పుష్పార్చన
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామిఅమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాలపూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పంచరాత్రగమ శాస్త్రం ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. లక్ష పుష్పార్చన పూజల్లో దేవస్థాన ఉప ప్రధానార్చకులు, వేదపండితులు, అర్చకబృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా అమ్మవారి ఊంజల్‌సేవ
యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతోఅలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ. 516 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణ జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. అర్చక బృందం వైభవంగా పూజలు నిర్వహించారు. ముతయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకా ల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగాయి.
స్వామివారి సేవలో ఎమ్మెల్సీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు.
రూ. 17,36,868 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 17,36,868 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,99,868, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 66,000, ప్రచారశాఖ ద్వారా రూ. 6,600, క్యాలెండర్ల ద్వారా రూ. 15,500, వ్రతాల ద్వారా రూ. 4,41,500, కల్యాణ కట్ట ద్వారా రూ. 28,160, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 6,46, 600, శాశ్వత పూజల ద్వారా రూ. 10,116, వాహనపూజల ద్వారా రూ. 15,300, టోల్గేట్ ద్వారా రూ. 670, అన్నదాన విరాళం ద్వారా రూ. 3,463, ఇతర విభాగాలు రూ. 3,03,109 లతో కలిపి రూ. 17,36,868 ఆదాయం వచ్చింది.
మత్స్యాద్రిపై స్వామివారి కల్యాణం
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోగల మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి వేములకొండగుట్టపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. దేవస్థానం ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి దంపతులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశవ్యాప్తంగా 10వేల కంపెనీల మూత.. ఎందుకంటే?!
- చికిత్స పొందుతూ యాసిడ్ దాడి బాధితురాలు మృతి
- మనువాడే వ్యక్తితో స్టైలిష్ ఫొటో దిగిన మెహరీన్
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్