గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 11, 2020 , 00:09:55

యాదాద్రీశుకి భారీ ఆదాయం

యాదాద్రీశుకి భారీ ఆదాయం

  • కార్తికమాసంలో తరలివచ్చిన భక్తులు 
  • హరిత హోటల్‌లో స్వామివారి హుండీల లెక్కింపు 
  • 22 రోజుల్లో రూ. 94,64,969 నగదు...147 గ్రాముల బంగారం, 3.2 కిలోల వెండి
  • శ్రీవారి నిత్య ఆదాయం రూ. 12,66,716 

ఆలేరు: కార్తిక మాసం సందర్భంగా యాదాద్రీశుడికి భారీ ఆదాయం సమకూరింది. కరోనా పరిస్థితులను సైతం లెక్క చేయకుండా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వ్ర తాలు, కార్తికమాసం ప్రత్యేక పూజలు చేపట్టారు. దీంతో స్వామివారికి 22రోజుల హుండీల ఆదా యం రూ. 94లక్షలు దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్‌.గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపై గల హరిత హోటల్‌లో హుండీలను లెక్కించామని, నగదు రూ.94,64,969  ఆదాయం వచ్చిందని చెప్పారు. బంగారం 147 గ్రాములు, మిశ్రమ వెండి  మూడు కిలోల 200 గ్రాములు వచ్చిందన్నారు. గత నవంబర్‌ 15న అమావాస్య అనంతరం ప్రారంభమైన కార్తిక శుద్ధ మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో చేపట్టే సత్యనారాయణస్వామి వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీసత్యనారాయణ వ్రతాలను 6 బ్యాచ్‌లుగా విభజించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ప్రత్యేక పూజల కోలాహలం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. బాలాలయంలోని మంటపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం జరిపించారు. కార్తికమాసం పురస్కరించుకుని కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణి చెంతన భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలోని వ్రత మండపాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్దఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.2,97,500 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

శ్రీవారి ఖజానాకు రూ.12,66,716 ఆదాయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.12,66,716 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1,16,384, రూ.100 దర్శనాలతో రూ.80,000, ప్రచారశాఖతో రూ. 3,850, క్యాలెండర్లతో రూ.16,000, వ్రతాల ద్వారా రూ. 2,97,500, కల్యాణ కట్టతో రూ. 27,920, ప్రసాద విక్రయాలతో రూ. 4,86,440, శాశ్వత పూజలతో రూ. 6,000, వాహన పూజలతో రూ.12,700, టోల్‌గేట్‌ ద్వారా రూ.1,320, అన్నదాన విరాళంతో రూ.13,165, ఇతర విభాగాలతో రూ. 2,05,437 లతో కలిపి రూ. 12,66,716 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

VIDEOS

logo