ప్రతి గ్రామానికి సాగు నీరు

- అందించాకే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
- మూడు గ్రామాల్లో నూతన పంచాయతీ కార్యాలయాలు ప్రారంభం
బస్వాపురం రిజర్వాయర్ ద్వారా బునాదిగాని కాలువ నుంచి ఆత్మకూరు(ఎం) మండలంలోని ప్రతి గ్రామానికి సాగు నీరు అందించి, మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లింగరాజుపల్లి, తుక్కాపురం, కఫ్రాయిపల్లి గ్రామాలలో ఒక్కొక్కటి రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కారు చేతల ప్రభుత్వమని అన్నారు.
- ఆత్మకూరు(ఎం)
- అందించాకే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
ఆత్మకూరు(ఎం) : బస్వాపురం రిజర్వాయర్ ద్వారా బునాదిగాని కాలువ నుంచి మండలంలోని ప్రతి గ్రామానికి సాగు నీరు అందించి మళ్లీ ఎన్నికలలో ఓట్లు అడుగుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లింగరాజుపల్లి, తుక్కాపురం, కఫ్రాయిపల్లి గ్రామాలలో ఒక్కొక్కటి రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణంతో పాటు మండలంలోని మోదుగుబావిగూడెం నుంచి కఫ్రాయిపల్లి ప్రధాన రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మిలాంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలువాలని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండమంగమ్మాశ్రీశైలంగౌడ్, మోత్కూరు ఏఎంసీ చైర్పర్సన్ వనం స్వాతి, జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, ఎంపీడీవో రాములు, సర్పంచ్‌లు సామవరలక్ష్మి, ఎర్రగీత, దయ్యాలరాజు, సరిత, కమలమ్మ, ప్రమీల, ఎంపీటీసీలు వెంకటేశం, మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉప్పలయ్య, పంచాయతీరాజ్ డీఈ నరేందర్, ఏఈ రవీందర్‌గౌడ్, మాజీ ఎంపీపీ భాగ్యశ్రీ, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్ భిక్షపతి, ఉప సర్పంచ్ రశీద్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
- పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్
- షాకింగ్.. బాలుడిపై లైంగికదాడి
- 22 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు కూలడం వల్లే..