బుధవారం 03 మార్చి 2021
Yadadri - Dec 11, 2020 , 00:09:59

జయహో ధరణి

జయహో ధరణి

  • పోర్టల్ సేవలకు రైతుల ఫిదా
  • జిల్లావ్యాప్తంగా 38 రోజుల్లో 2,127 రిజిస్ట్రేషన్లు
  • నిమిషాల వ్యవధిలోనే వేగంగా పనులు 
  • స్లాట్‌ బుకింగ్‌కు అన్నదాతల అమితాసక్తి 
  • ప్రయాణమే ఆలస్యం... పని మరింత సులభం 

ధరణి... ఎన్నో ఏండ్ల వేల సమస్యలకు పరిష్కారం చూపుతోంది. దళారీలు లేరు.. లంచాలు లేవు... అవకతవకలు అసలే లేవు.. ఫలితంగా ధరణి పోర్టల్‌ సేవలకు జనం జేజేలు పలుకుతున్నారు. భూ యజమానికి హక్కు రావడానికి మధ్యవర్తుల ప్రమేయం, దళారుల దందా, ఇతరత్రా వ్యక్తులతో ఎన్నెన్నో సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడా సమస్యలేవీ లేకుండా.. సులభంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భూముల రిజిస్ట్రేషన్లను ఏండ్ల తరబడిగా వాయిదా వేసుకున్న రైతాంగం ధరణి పోర్టల్‌ వచ్చాక పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. నవంబర్‌ 2 నుంచి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రాగా.. జిల్లాలో గడిచిన 38 రోజుల్లో 2,127 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియలు ఏకకాలంలోనే పూర్తవుతుండడంతో దూరభారం, చార్జీల ఖర్చు తప్పిందని రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

  • సేవలకు ఫిదా అవుతున్న అన్నదాతలు
  • రిజిస్ట్రేషన్ల సులభతరంతో దరఖాస్తు చేసేందుకు ఆసక్తి
  • జిల్లాలోముమ్మరంగా భూముల రిజిస్ట్రేషన్లు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’ సేవల్లో పారదర్శకత పెరుగుతున్నది. భూయాజమాన్య హక్కుల జారీ సులభతరంగా మారింది. ఒకే చోట రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పని చిటికెలో పూర్తవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 8వ తేదీ నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్ల సేవలు నిలిచిపోగా..55 రోజుల తర్వాత తెలంగాణ ప్రభు త్వం సరికొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ద్వారా నవంబర్‌ 2 నుంచి తిరిగి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.‘ధరణి’పై ఏర్పడిన నమ్మకంతో రైతాంగం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటుండగా.. గడిచిన 38 రోజుల వ్యవధిలో జిల్లాలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లను నిర్వహించారు. మొదట్లో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ క్రమంగా తొలిగిపోయాయి. ఇటీవల వ్యవసాయ తనఖా రుణాల కోసం మార్టిగేజ్‌ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన సేవలు సైతం త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలోని ఐదు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే స్లాట్‌ బుకింగ్‌ కోసమే కనీసం వారం రోజుల స మయం పట్టేది. సాక్షులను వెంట బెట్టుకుని యాభై కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సి వచ్చేది. కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జరుగుతున్నాయి. అన్నీ ధ్రువీకరణ పత్రాలతో స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న మరుసటి రోజునే నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతున్నది.

ఖజానాకు కాసుల వర్షం

రిజిస్ట్రేషన్‌ సేవల్లో జిల్లా తనదైన ముద్ర  గడిచిన 38 రోజుల వ్యవధిలో 2,127 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మిగిలిన 53 పలు కారణాలతో పెండింగ్‌లో ఉ న్నాయి. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారు నిర్ణీత గడువులోపు రాకపోవడం.. తిరిగి సమయాన్ని తీసుకోవడం.. కొన్నింటిలో వివాదాలు ఉండడంతో రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, మార్టిగేజ్‌ సేవల నిర్వహణతో తహసీల్దార్‌ కార్యాలయాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురుస్తున్నది. ఎకరాకు రూ. 2,500 రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్థానిక భూముల విలువ ఆధారంగా స్టాం ప్‌ డ్యూటీ, ఇతర ఫీజులను చెల్లిస్తున్నారు.ఎకరాకు గిఫ్ట్‌ డీడ్‌కు రూ.3వేలు, సేల్‌ డీడ్‌కు రూ.12వేలు ఖర్చవుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు ఐదు వేలకు పైగా ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు సైతం భారీగానే ఆదాయం సమకూరింది.  

రోజుల్లో 2,127 రిజిస్ట్రేషన్లుVIDEOS

logo