శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 10, 2020 , 00:54:28

అంబులెన్స్‌ అందజేయడం సంతోషంగా ఉంది

అంబులెన్స్‌ అందజేయడం సంతోషంగా ఉంది

  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

అంబులెన్స్‌ అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.  మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌కు అందజేసిన అంబులెన్స్‌ను బుధవారం  మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన సమీపంలో జెండాఊపి ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా పేదలను ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్‌ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వం మార్చిందన్నారు. 

భువనగిరి అర్బన్‌ 

భువనగిరి అర్బన్‌: మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్‌ స్మైల్‌కు అందజేసిన అంబులెన్స్‌ను జిల్లా ప్రజల అత్యవసరాలకు కేటాయించినందుకు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అని, అంబులెన్స్‌ను అందించడం సంతోషంగా ఉందని  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గిఫ్ట్‌ స్మైల్‌కు అందజేసిన అంబులెన్స్‌ వాహనాన్ని బుధవారం ప్రభుత్వ ఏరియా దవాఖాన సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన అంబులెన్స్‌ను జెండా ఊపీ ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం సహాయనిధి, అత్యవసర పరిస్థితిలో ఎల్‌వోసీ నిధులు అందజేస్తుందన్నారు. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్‌ దవాఖానకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం మార్చిందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడం, వైద్య సిబ్బందిని పెంచడంతో గతంలో కంటే సాధారణ ప్రసవాలు పెరిగాయాన్నారు. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన గిఫ్ట్‌ స్మైల్‌ కార్యక్రమం ఎంతో ఆదరణ పొందిందన్నారు. కార్యక్రమానికి అందజేసిన అంబులెన్స్‌ వాహనాలు ప్రజల అత్యవసరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తూ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు ముందుండాలన్నారు. 

అత్యవసరాలకు ఉపయోగపడుతుంది : కలెక్టర్‌  

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అందజేసిన అంబులెన్స్‌ ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్‌ అందుబాటులో లేకుంటే మనిషి జీవితం కనుమరుగై పోతుందన్నారు. పట్టణ, గ్రామాల్లో అత్యవసర పరిస్థితులల్లోనైనా అంబులెన్స్‌ వాహనాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు 108 సేవలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ బీరు మల్లయ్య, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల అధ్యక్షులు గోమారి సుదాకర్‌రెడ్డి, జనగాం పాండు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, కౌన్సిలర్లు పంగరెక్క స్వామి, కిరణ్‌కుమార్‌, వెంకట్‌నర్సింగ్‌నాయక్‌, శంకర్‌, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo