ఫాస్టాగ్ తప్పనిసరి

- కొత్త ఏడాది నుంచి అమలుకు కేంద్రం ఉత్తర్వులు
- టోల్‌ప్లాజాలో నగదు చెల్లింపులకు నో చాన్స్
- వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు
- ట్రాఫిక్ సమస్యలకు చెక్తప్పనున్న తిప్పలు
- వాహనదారులకుఅవగాహన
- జనవరి 1 నుంచి అమలు
ఆలేరు టౌన్: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2021 జనవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజాల్లో నూటికి నూరుశాతం ఫాస్టాగ్ అమలు చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. అయితే టోల్‌ప్లాజాల నుంచి ప్రయాణించే వాహనదారులకు ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి టోల్‌ప్లాజాల వద్ద వాహదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వారికి వివరిస్తున్నారు. జిల్లాలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై గూడూరు వద్ద, హైదరాబాద్- విజయవాడ రహదారిపై పంతంగి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి.
ఫాస్టాగ్‌తో సాఫీగా ప్రయాణం
టోల్‌ప్లాజాల్లో ఏ మాత్రం ఆగకుండా ఫాస్టాగ్ ఉంటే సాఫీగా ప్రయాణం చేయవచ్చు. వాహ నం టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే ఫాస్టాగ్ స్టిక్కర్ ప్లాజా వద్ద స్కానర్‌లో స్కాన్ అయి నిర్ణీత రుసుం చెల్లింపు జరుగుతుంది. ఫాస్టాగ్ ధర వాహనాన్ని బట్టి ఉంటుంది. టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ వాహనాలు వెళ్లేందుకు, డబ్బులు చెల్లించి వాహనదారులు వెళ్లేందుకు దారులు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. వివిధ సమావేశాలు, పండుగలు, వివాహాలు అధికంగా ఉన్నప్పుడు, ఆదివారం రోజుల్లో టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతుంటాయి. ఒక్కోసారి కంప్యూటర్లో ఆన్లైన్ సమస్యలు తలెత్తినప్పుడు, చిల్లరకోసం వాహనాలు నిలిచిపోయేవి. ఇక నుంచి ఇక్కట్లకు చెక్ పడనున్నది.
2014లో మొదటిసారిగా ..
దేశంలో మొదటి సారిగా 2014లో ఫాస్టాగ్‌ను ఫైలట్ ప్రాజెక్టు కింద అహ్మదాబాద్ నుంచి ముంబాయి రహదారిపై అమలు చేశారు. ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోని వాహనదారులు ప్లాజా వద్దకు వెళ్లి ట్యాగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు అకౌంట్, వాహన ఆర్సీ జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, తగిన రుసుం చెల్లించాలి. దీంతో వాహనదారుడు ప్లాజాను దాటగానే నిర్ణీత రుసుం వారి ఖాతా నుంచి కట్ అవుతుంది.
మంచి నిర్ణయం
ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కేంద్రం ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడం మంచి నిర్ణయం. టోల్‌ప్లాజాల వద్ద అనేక సందర్భాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక్కోసారి నిర్ణీత సమయానికి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం. టోల్‌ప్లాజాల వద్ద డబ్బులు చెల్లించడం, చిల్లర తీసుకోవడం వల్ల ఆలస్యం జరుగుతుంది.
- ఐడియా శ్రీనివాస్, వాహనదారుడు, ఆలేరు
తాజావార్తలు
- కూలి డబ్బుల కోసం ఘర్షణ.. ఒకరు మృతి
- భోజనం చేశాక ఎంత సేపటికి నీళ్లు తాగాలో తెలుసా..?
- ఈ భామకు విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేయాలనుందట..!
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!