సోమవారం 01 మార్చి 2021
Yadadri - Dec 07, 2020 , 00:32:17

అంబేద్కర్‌కు ఘన నివాళి

అంబేద్కర్‌కు ఘన నివాళి

మోత్కూరు : పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్‌ చేసిన కృషి మరువలేనిదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహానికి, మున్సిపల్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కల్యాణ్‌ చక్రవర్తి, వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కొణతం యాకుబ్‌ రెడ్డి, మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేందర్‌నాథ్‌, తీపిరెడ్డి మేఘారెడ్డి, ఎస్సీ సెల్‌ విభాగం అధ్యక్షుడు చెడుపల్లి రఘుపతి,నాయకులు జంగ శ్రీను, ఎండీ మజీద్‌, కోమటీ మత్స్యగిరి ,స్వామిరాయుడు దబ్బెటి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్‌ కృషి మరువలేనిది 

చౌటుప్పల్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని మున్సిపల్‌ చైర్మ న్‌ వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో టీఆర్‌ఎస్‌ గ్రా మ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్‌ వర్ధంతిలో వారు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్‌ కృషి మరువలేని దన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్‌, మున్సిపాలిటీ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్‌గౌడ్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ చెన్నగోని అంజయ్యగౌడ్‌, నాయకులు పాశం సంజయ్‌బాబు, సుర్వి మల్లేష్‌గౌడ్‌, ఊదరి నర్సింహ, కంది లక్ష్మారెడ్డి,డిల్లి మాధవరెడ్డి,  బొబ్బిళ్ల మురళి, స్వామిగౌడ్‌ పాల్గొన్నారు. 

నారాయణపురంలో..

సంస్థాన్‌ నారాయణపురం: బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంస్థాన్‌ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి వారు పూలమలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఈసం యాదయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు వీరమళ్ల వెంకటేశ్‌, టీఆర్‌ఎస్వీ మునుగోడు అధ్యక్షుడు నాలపరాజు రమేష్‌ పాల్గొన్నారు.

ఎల్లగిరి గ్రామపంచాయతీ వద్ద

చౌటుప్పల్‌ రూరల్‌ : ఎల్లగిరి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం అంబేద్కర్‌ వర్ధంతిని నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి సర్పంచ్‌ రిక్కల ఇందిర సత్తిరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, గ్రామస్తులు కందకట్ల యాదిరెడ్డి, కొలుకులపల్లి రవితేజ, కొత్త నర్సింహ, పోలెపల్లి కిష్టయ్య, దినేష్‌, లాలయ్య, మారగోని లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేటలో..

రామన్నపేట: అంబేద్కర్‌ వర్ధంతిని మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, ఎంఆర్‌పీఎస్‌, స్వేరోస్‌ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో బందెల రాములు, పృథ్వీరాజ్‌, మొగలయ్య, బలరాం, బొడ్డు సురేందర్‌, బొడ్డు శంకరయ్య, మేక అశోక్‌రెడ్డి, నాగటి ఉపేందర్‌, ఆమేర్‌, మక్లా నాయక్‌, రుద్రాల శ్రీరాములు, ఈర్లపల్లి మల్లయ్య, నోముల యాదగిరి,  నాగరాజు తదితరులు పాల్గొన్నారు.   

అంబేద్కర్‌ ఆశయాలను సాధించాలి 

అడ్డగూడూరు: అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని అడ్డగూడూరు సర్పంచ్‌ బాలెంల త్రివేణి అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో బాలెంల పరుశురాములు,బాలెంల అరవింద్‌, అవినాష్‌,నరేష్‌,రాము తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo