గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 05, 2020 , 00:21:37

విశ్వ విఖ్యాత ఆలయంగా యాదాద్రి

విశ్వ విఖ్యాత ఆలయంగా యాదాద్రి

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారు
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • కుటుంబసమేతంగా నారసింహుడిని దర్శించుకున్న మంత్రి... 
  • ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన 
  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఆలేరు: విశ్వ విఖ్యాత ఆలయంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిలువబోతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. శుక్రవారం కార్తికమాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానాలయంతో పాటు గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రపంచంలో యాదాద్రికి స్థానం ఉండే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు.  తెలంగాణకు తలమానికంగా దేశంలోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రంగా విరాజిల్లడానికి అవసరమైన హంగులను యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయం సమకూర్చుకుంటుందన్నారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారన్నారు. కేవలం నాలుగేండ్లలోనే ఆలయ పునర్నిర్మాణం పూర్తికావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఆలయ ఏఈవోలు శ్రవణ్‌కుమార్‌, గజవెల్లి రమేశ్‌బాబు, ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, ఏవో రాజేశ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కాంటెకార్‌ పవన్‌కుమార్‌, ఇండ్ల వెంకటేశ్‌, సత్యనారాయణగౌడ్‌ ఉన్నారు. 


VIDEOS

logo