‘గ్రేటర్'లో మన గులాబీలు

- జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన జిల్లావాసులు
- అధికార పార్టీ తరఫున బల్దియా బరిలోకి...
- గోల్నాక కార్పొరేటర్‌గా చల్లూరువాసి దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్..
- చింతల్ కార్పొరేటర్‌గా బేగంపేటవాసి రషీదారఫీ
- తార్నాక కార్పొరేటర్‌గా తుక్కాపురంవాసి మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి
- నాచారం కార్పొరేటర్‌గా వలిగొండవాసి శాంతి సాయిజన్‌శేఖర్
- స్వగ్రామాల్లో విజయోత్సవ సంబురాలు
రాజాపేట: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి గోల్నాక కార్పొరేటర్ అభ్యర్థిగా మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్, చింతల్ కార్పొరేటర్ అభ్యర్థిగా బేగంపేటకు చెందిన రషీదారఫీ బరిలో ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా జరిగిన బల్దియా పోరులో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు ఇద్దరు భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో చల్లూరు. బేగంపేట గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గ్రామాల్లో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపుపై మదర్‌డెయిరీ డైరెక్టర్ అర్కాల గాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, సర్పంచ్ పంబ కరుణాకర్, సీసీబ్యాంక్ డైరెక్టర్ గుంటి కృష్ణ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సామల రమేశ్, టీఆర్ఎస్ నాయకులు మాటూరి రాజు, గుంటి కరుణాకర్, వెంకటేశ్‌గౌడ్, భిక్షపతి అభినందనలు తెలిపారు.
వలిగొండ ఆడబిడ్డ చిట్టిప్రోలు శాంతి విజయం
వలిగొండ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వలిగొండ ఆడబిడ్డ అయిటిపాముల విఠల్ విజయలక్ష్మీ దంపతుల కుమార్తె చిట్టిప్రోలు శాంతి సాయిజన్‌శేఖర్ విజయం సాధించారు. నాచారం ఆరో డివిజన్ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అనితా పద్మారెడ్డిపై 1250 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంద్ర, రత్నయ్య, భిక్షపతి, వలిగొండ మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్ సతీశ్, అప్రొద్దీన్, నర్సింహ, సుధాకర్, యూత్ అధ్యక్షుడు లింగస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శాంతి కుమార్ అభినందించారు.
ఆలేరులో టీఆర్ఎస్ సంబురాలు
ఆలేరు టౌన్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందడంపై శుక్రవారం ఆలేరులో ఆపార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ నాగరాజు, కౌన్సిలర్లు రాములు, నర్సింహులు, శ్రీకాంత్, మాజీ సర్పంచ్‌లు మురళి, శ్రీనివాస్, నాయకులు బాలస్వామి, రవి, ఉప్పలయ్య, రాజేశ్, వెంకటయ్య, రమణారెడ్డి, జల్లి నర్సింహులు, మల్లేశం, సంతోష్, భాను, రవి పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి..
చౌటుప్పల్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై మండల, మున్సిపాలిటీ ప్రజలు ఆసక్తి కనబర్చారు. ఉదయం నుంచే యువతతో పాటు వివిధ పార్టీల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు టీవీలకు అతుక్కుపోయారు.సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను విజయతీరానికి చేర్చాయని ఆపార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
చందానగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ గెలుపుపై ప్రభుత్వ విప్ హర్షం
ఆలేరు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ విప్ ఇన్చార్జిగా వ్యవహరించిన చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మంజులారఘునాథ్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా చందానగర్ కార్పొరేటర్ అభ్యర్థి గెలుపుపై ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నాపై ఇంతటి నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తార్నాక కార్పొరేటర్‌గా మోతెశ్రీలతాశోభన్రెడ్డి
ఆత్మకూరు(ఎం): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మండలంలోని తుక్కాపురం గ్రామానికి చెందిన మోతెశ్రీలతాశోభన్రెడ్డి టీఆర్ఎస్ తార్నాక కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించింది.
తాజావార్తలు
- జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నిక
- విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం
- రిమ్జిమ్ రిమ్జిమ్.. హైదరాబాద్
- భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
- 7న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం
- అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
- టీఎస్ బీపాస్‌కు విశేష ఆదరణ
- సురభి గెలుపే ధ్యేయంగా..
- పట్టభద్రులు ఆలోచించండి..!
- పట్టభద్రులే సరైన నిర్ణేతలు