మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Dec 04, 2020 , 00:22:25

శ్రీకాంతాచారికి నివాళి

శ్రీకాంతాచారికి నివాళి

తుర్కపల్లి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని మండలంలోని వీరారెడ్డిపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి పూలమాల  వేసి నివాళులర్పించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  సుశీల, జడ్పీవైస్‌చైర్మన్‌ బీకునాయక్‌, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్‌, సర్పంచ్‌ శ్రీవాణి , టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు భాస్కర్‌ , సోషల్‌మీడియా కన్వీనర్‌ శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధానకార్యదర్శి ఐలేశ్‌, నాయకులు  మనోహర్‌రెడ్డి, భాస్కర్‌నాయక్‌, పాండు, ప్రేమ్‌చారి, వెంకటేశ్‌, రాజు, శ్రవణ్‌కుమార్‌, క్రాంతికుమార్‌, ప్రసాద్‌, మహేందర్‌, కనకయ్య, భరత్‌ , రమేశ్‌, బాలకృష్ణ, నల్లశ్రీకాంత్‌, ప్రవీణ్‌, హేమంత్‌, కనకరాజు పాల్గొన్నారు.

ముత్తిరెడ్డిగూడెంలో..

మోటకొండూర్‌: తెలంగాణ సాధనలో అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతిని మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో సర్పంచ్‌ ఆడెపు విజయస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు గంగరబోయిన రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల  ఉపాధ్యక్షుడు గుర్రాల రవి, టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ కార్యదర్శి పన్నీరు భరత్‌, నాయకులు పంతుల భూపాల్‌, నర్సింహ  పాల్గొన్నారు. 

భువనగిరిలో

భువనగిరి అర్బన్‌: తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల  వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగళ్లపల్లి రవికుమార్‌, చిక్కుల వెంకటేశం, చుక్క స్వామి, నందు, నర్సింహ, కూర వెంకటేశ్‌, ఎండీ.తాహెర్‌, ఎండీ.సలావుద్దీన్‌ పాల్గొన్నారు. 

అడ్డగూడూరులో....

అడ్డగూడూరు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని  మండలకేంద్రంలో బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో కడియం సోమన్న, పల్లపు సమ్మయ్య, గూడెపు బాబు, బాలెంల సురేశ్‌, పరశురాములు, శంకర్‌, నవీన్‌,మహేశ్‌,వెంకటయ్య పాల్గొన్నారు.

ఆలేరులో...

ఆలేరు: టీఆర్‌ఎస్‌ మండల  నాయకులు  యాదగిరిగుట్ట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా  మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎరుకల సుధ, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు మాట్లాడారు.  

ఆత్మకూరు(ఎం)లో...

ఆత్మకూరు(ఎం):  తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా  మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల  వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన, విద్యార్థి విభాగం నాయకులు శేఖర్‌, మల్లికార్జున్‌, రాజు, ఉపేందర్‌రెడ్డి, హైమద్‌, నవీన్‌, మహేశ్‌  పాల్గొన్నారు. 

శ్రీకాంత్‌చారి త్యాగం వెల కట్టలేనిది

గుండాల: శ్రీకాంత్‌చారి త్యాగం వెల కట్టలేనిదని జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.ఖలీల్‌ అన్నారు.  టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు ఎండీ.ఉస్మాన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల  వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల నాయకులు చిందం ప్రకాశ్‌, నాగెల్లి రమేశ్‌, యూత్‌ నాయకులు అట్ల రంజిత్‌రెడ్డి, సాయికుమార్‌, లింగస్వామి, యాదయ్య  పాల్గొన్నారు.

VIDEOS

logo