సోమవారం 01 మార్చి 2021
Yadadri - Dec 02, 2020 , 00:29:39

ఆంజనే యుడికి పూజలు

ఆంజనే యుడికి పూజలు

ఆలేరు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని విష్ణు పుష్కరిణ వద్ద గల ఆందజేయస్వామి ఆలయంలో మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేశారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతోఅర్చన జరిపారు.బాలాలయ మండపంలో శ్రీ లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణం చేశారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహా మండపంలో ఆష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలంకార సేవోత్సవాన్ని  సంప్రదాయంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి శ్రీ చందనంతో అభిషేకం నిర్వహించారు. తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణం చేశారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించారు. 

కార్తిక మాసం ప్రత్యేక పూజలు

ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు బాలాలయంలో శ్రీవారి అభిషేకం, అర్చనలు చేశారు. మండపంలో అష్టోత్తర పూజలతో పాటు సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. బాలాలయంలో కల్యాణ మూ ర్తులను ఊరేగించి నిత్యకల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా చేపట్టారు. సాయంత్రం ఊరేగింపు సేవలో భక్తులు  పాల్గొని  మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజామునే భక్తులు దీపారాధన చేశారు. సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాల్లో   భక్తులు పాల్గొన్నారు. 

స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

కార్త్తిక మాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయ నిర్మాణంతో సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆయన వెంట  టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు కాంటెకార్‌ పవన్‌ కుమార్‌ ఉన్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 8,89,458 ఆదాయం

లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 8,89,4598 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 1,69,034, రూ. 100 దర్శనాల ద్వారా  రూ. 14,500, రూ. 150 దర్శనాల ద్వారా 54,750, ప్రచారశాఖ ద్వారా రూ. 8,000, వ్రతాల ద్వారా రూ. 1,17,500, కల్యాణ కట్ట ద్వారా రూ. 13,120, ప్రసాదవిక్రయాల ద్వారా  రూ. 2,97,950, శాశ్వత పూజల ద్వారా రూ. 6,000,  వాహనపూజల ద్వారా  రూ. 21, 100, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,380, అన్నదాన విరాళం ద్వారా  రూ. 3,168, ఇతర విభాగాలు  రూ. 1,82,956 లతో కలిపి రూ.  8,89,458 ఆదాయం వచ్చింది. 

VIDEOS

logo