శనివారం 06 మార్చి 2021
Yadadri - Dec 02, 2020 , 00:29:02

మలిదశ అమరవీరుడు కిష్టయ్యకు నివాళులు

మలిదశ అమరవీరుడు కిష్టయ్యకు నివాళులు

ఆలేరురూరల్‌ : తెలంగాణ మలిదశ అమరుడు, కానిస్టేబుల్‌ కిష్టయ్య ముదిరాజ్‌ వర్ధంతిని మంగళవారం మండలంలోని కొలనుపాక శ్రీపెద్దమ్మ ముదిరాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్‌ ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు కాటం రాజు, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు మామిండ్ల ఉప్పలయ్య, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బెదరబోయిన శంకర్‌, ముదిరాజ్‌ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గుండాలలో...

గుండాల: అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ముదిరాజ్‌ సంఘం మండల అధ్యక్షుడు నాగారపు రమేశ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని వస్తాకొండూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు యాట రాజు, వెంకన్న, జడిగల చంద్రశేఖర్‌, శివరామకృష్ణ, సందీప్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి అర్బన్‌లో... 

భువనగిరి అర్బన్‌: తెలంగాణ మలి ఉద్యమంలో అమరులైన కానిస్టేబుల్‌ కిష్టయ్య ముదిరాజ్‌ 11వ వర్ధంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద నిర్వహించిన అమరువీరుల స్థూపం వద్ద రైతు సమన్వయ సమతి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కానిస్టేబుల్‌ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్‌ యువసేనా రాష్ట్ర ప్రధాన కారదర్శి సాదు రామకృష్ణ, ముదిరాజ్‌ నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo