ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Dec 01, 2020 , 00:36:41

వైభవంగా కార్తీక పూజలు

వైభవంగా కార్తీక పూజలు

  • ఆలయాల్లో సందడి 

ఆలేరు టౌన్‌ : ఆలేరు పట్టణంలోని పలు ఆలయాల్లో కార్తిక సందడి నెలకొన్నది. సోమవారం భక్తులు ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.  

ఆలేరురూరల్‌లో... 

ఆలేరురూరల్‌ : కార్తిక పౌర్ణమి సందర్భంగా సోమవారం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కొనుపాకలోని శ్రీస్వయంబు సోమేశ్వరాలయం, రాఘవాపురంలోని దక్షిణకాశిబుగ్గ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొన్నది. ఉదయం నుంచే మహిళలు ఏకాదశి రుద్రాభిషేకం, అర్చనలు, గోత్రనామార్చనలు, దీపాలంకరణ కృత్రిక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.  

మోటకొండూర్‌లో... 

మోటకొండూర్‌: మండల వ్యాప్తంగా సోమవారం భక్తులు వేకువజామున స్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలో అయ్యప్పస్వామి భక్తులు కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టారు.

ఆత్మకూరు(ఎం)లో... 

ఆత్మకూరు(ఎం): కార్తిక పౌర్ణమి సందర్భంగా సోమవారం మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో భక్తులు దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. మహిళలు ఇండ్ల ముందు, దేవాలయాల్లో కార్తిక దీపాలు వెలిగించారు.

రాజాపేటలలో... 

రాజాపేట : మండల కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం కార్తిక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల్లో సామూహిక వ్రతాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి వేళ్లల్లో ఇంటి ముందు దీపాలు వెలిగించారు.

బొమ్మలరామారంలో... 

బొమ్మలరామారం: మండల కేంద్రంతోపాటు రామలింగంపల్లి, మల్యాల, నాగినేనిపల్లి, మైలారం, పెద్దపర్వతాపూర్‌, మర్యాల, ఫక్కీర్‌గూడ తదితర గ్రామాల్లోని శివాలయాల్లో సోమవారం కార్తిక పౌర్ణమిని భక్తులు ఘనంగా నిర్వహించారు. శివలింగాలకు అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామున, సాయంకాలం దీపారాధన చేశారు. చీకటిమామిడి శ్రీతిరుమలనాథస్వామి ఆలయం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ గొడుగు శోభాచంద్రమౌళి, సర్పంచ్‌ మచ్చ వసంతాశ్రీనివాస్‌, భువనగిరి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రామిడి రాంరెడ్డి, ఉపసర్పంచ్‌ జూపల్లి భరత్‌, రాగుల బాల్‌రాం తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo