శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 29, 2020 , 00:13:33

లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం

లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం

  • సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం
  • వాసాలమర్రిలో అభివృద్ధి పరుగులు

తుర్కపల్లి: మండలంలోని వాసాలమర్రిలోని అటవీ ప్రాంతంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధి కోసం గ్రామానికి  వచ్చిన అధికారులకు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరారు. దీనికి స్పందించిన అటవీశాఖ అధికారులు ఆలయాన్ని సందర్శించి చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రణాళిక రుపొందించారు. అందులో భాగంగా ఆలయం వద్ద అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు, రోడ్డు వెడల్పు, తాగునీటి వసతి తదితర పనులను చేపట్టారు. కార్తికపౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 30న నిర్వహించే స్వామివారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారు.


VIDEOS

logo