ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 29, 2020 , 00:13:31

యాదాద్రీశుడి సన్నిధిలో శాస్త్రోక్త పూజలు

యాదాద్రీశుడి సన్నిధిలో శాస్త్రోక్త పూజలు

  • పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్న భక్తులు 
  • శ్రీవారి ఖజానాకు రూ. 9,88,830 ఆదాయం 

ఆలేరు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా పూజలు జరిపారు. ఉదయం స్వామివారి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చనలు, అభిషేకం, సువర్ణపుష్పార్చన చేపట్టి, శ్రీసుదర్శన నారసింహహోమం చేపట్టారు. పంచారాత్రగమ శాస్త్ర ప్రకారం స్వామి అమ్మవార్లకు మహానివేదన జరిపి శయనోత్సవం నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తులచే జరుపబడు ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహహోమం, స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వెండి మొక్కు జోడుసేవలు, సువర్ణపుష్పార్చన పూజల్లో భక్తులు పరిమితి సంఖ్యలో పాల్గొన్నారు. 

యాదాద్రిలో కార్తికమాసం పూజలు

యాదాద్రిలో కార్తికమాసం పర్వదినాలను పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వేకువజామున మహిళలు కార్తికమాసం దీపారాధన నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌,  సిద్దిపేట కలెక్టర్‌

కార్తికమాసం శనివారం పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ డాక్టర్‌ గుగులోత్తు శంకర్‌నాయక్‌,  సిద్దిపేట కలెక్టర్‌ వెంకటరామిరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీత, ఏఈవో శ్రవణ్‌కుమార్‌, అర్చకులు పాల్గొన్నారు. 

శ్రీవారి ఖజానాకు రూ. 9,88,830 ఆదాయం 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 9,88,830  ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.  ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 1,26,986, రూ. 100 దర్శనాల ద్వారా  రూ. 25,900, రూ. 150 దర్శనాల ద్వారా 25,500, ప్రచారశాఖ ద్వారా  రూ. 4,590, క్యాలండర్‌ ద్వారా  రూ. 700, వ్రతాల ద్వారా రూ. 2,00,500, కల్యాణ కట్ట ద్వారా రూ. 16,5 60, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 3,80,350, శాశ్వత పూజల ద్వారా రూ. 10,116, మినీబస్సుల ద్వారా రూ. 2,240, వాహనపూజల ద్వారా  రూ. 8,000, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,320, అన్నదాన విరాళం ద్వారా  రూ. 16,652, ఇతర విభాగాలు  రూ. 1,69,416 లతో కలిపి రూ.  9,88,830 ఆదాయం వచ్చిందని ఆమె తెలిపారు. 

VIDEOS

logo