బుధవారం 27 జనవరి 2021
Yadadri - Nov 28, 2020 , 00:17:15

ఏటీఎం సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఏటీఎం సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా

భువనగిరి/బీబీనగర్‌: ఏటీఎం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. శుక్రవారం ఎయిమ్స్‌ ఆవరణలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జోనల్‌ మేనేజర్‌ మన్మోహన్‌గుప్తా, ఎయిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనంతరావుతో కలిసి ఆయన నూతన ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  మట్లాడుతూ.. ఎయిమ్స్‌  ప్రాంగణంలో ఏటీఎం ఏర్పా టు చేయడంపై బ్యాంకు అధికారులకు అభినందనలు తెలియజేశారు. వివిధ విభాగాల్లో పనిచేసే దాదాపు ఐదు వందల మంది సిబ్బందికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అకౌం ట్లు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో విద్యార్థుల స్కాలర్‌షిప్‌ లు, ఇతర అవసరాల కోసం బ్యాంకు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. డిప్యూటీ డైరెక్టర్‌ కల్నల్‌ అనంతరావు మాట్లాడుతూ.. బ్యాంకు సేవలు పట్టణానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ఎయిమ్స్‌ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.      

నెలరోజుల్లో బ్యాంకు ఏర్పాటు చేస్తాం

నెల రోజుల్లో బ్యాంకు ఏర్పాటు చేస్తామని  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జోనల్‌ మేనేజర్‌ మన్మోహన్‌ గుప్తా అన్నారు. ఎయిమ్స్‌కు వచ్చే రోగులతో పాటు విద్యార్థులు, సిబ్బంది, బయటి వ్యక్తులకు సైతం అందుబాటులో ఉండేలా ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడి ప్రజల అవసరాల మేరకు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కోరినట్లు మరో నెల రోజుల్లో తమ బ్యాంకు ఆధ్వర్యంలో  నూతన బ్రాంచిని ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకు సిబ్బంది, ఎయిమ్స్‌ డాక్టర్ల బృందం పాల్గొన్నారు.


logo