రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి కలెక్టరేట్ : రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాజ్యాంగ రచనలో డాక్టర్ అంబేద్కర్ దార్శనికత నేటికీ భావితరాలకు ఆదర్శంగా ఉందన్నారు. భారతదేశానికి దిశానిర్దేశం చేసేందుకు రాజ్యాంగ అవసరాన్ని ఆనాడే గుర్తించి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, కీమ్యానాయక్, ఇన్చార్జి డీఆర్వో విజయకుమారి, కలెక్టరేట్ ఏవో నాగేశ్వరాచారి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
భువనగిరి : రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని చదివి వినిపించారు.కార్యక్రమంలో ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ, ఎంపీడీవో నాగిరెడ్డి పాల్గొన్నారు.
రాజ్యాంగమే దేశానికి దిక్సూచి
రామన్నపేట: రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని తహసీల్దార్ ఇబ్రహీం, ఎంపీడీవో జలేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
అంబేద్కర్ చిత్రపటం వద్ద ప్రతిజ్ఞ
ఆత్మకూరు(ఎం): మండల పరిషత్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండమంగమ్మాశ్రీశైలంగౌడ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది ఎండీ.మహబూబ్‌బేగ్, సరిత, నరేష్, సోమయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
గుండాల: అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ డెన్నిస్రెడ్డి, ఎంపీటీసీ శ్రీశైలం అన్నారు. గురువారం మండలంలోని అనంతారంలో భారత రాజ్యంగ అవిర్భావ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకుడు చెరుపల్లి కుమార్, నాయకులు చెరుపల్లి సిద్ధులు, చెరుపల్లి రాజయ్య, కుమ్మరికుంట్ల రాజరత్నం, ఎర్ర మల్లయ్య, రమేశ్, స్వామి, రామకృష్ణ పాల్గొన్నారు.
చౌటుప్పల్‌లో...
చౌటుప్పల్: మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాందుర్గారెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యంగ దినోత్సవాన్ని గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల రాజ్యంగాలకు భారతదేశ రాజ్యంగం స్ఫూర్తిదాయకంగా నిలిలిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్లు సుల్తాన్‌రాజు,గోపగోని లక్ష్మణ్‌గౌడ్, పోలోజు వనజ, ఉబ్బు వరమ్మ, నాగరాజు, పోలోజు శ్రీధర్‌బాబు, సందగళ్ల విజయ పాల్గొన్నారు.
తాజావార్తలు
- మోడెం, వై-ఫై రూటర్లు మరింత చౌక.. సర్కార్ ఫ్లాన్?!
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్‌లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి