అవకతవకలు లేకుండా భూముల రిజిస్టేషన్లు

భువనగిరి తహసీల్దార్ జనార్దన్‌రెడ్డి
భువనగిరి : ధరణి పోర్టల్ ద్వారా అవకతవకలకు ఆస్కారం లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని మండల తహసీల్దార్ జనార్దన్‌రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా గురువారం ఆయన ఆరు రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీసేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు తహసీల్దార్ కార్యాలయంలో వేగవంతంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు.
ధరణి పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి
మోటకొండూర్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గణేశ్‌నాయక్ అన్నారు. గురువారం మండలం వ్యాప్తంగా ధరణి పోర్టల్ ద్వారా 10 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి వెంటనే ప్రొసీడింగ్ పత్రాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఆసిఫ్, ధరణి ఆపరేటర్ రవి పాల్గొన్నారు.
రాజాపేటలో ఆరు..
రాజాపేట: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణిపోర్టల్ ద్వారా ఆరు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తహసీల్దార్ జయమ్మ తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు రైతులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని గురువారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. దీంతో వచ్చిన అరగంటలోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధరణి ఆపరేటర్ మల్లేశ్ పాల్గొన్నారు.
సులువుగా రిజిస్ట్రేషన్లు
బొమ్మలరామారం: ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా జరుగుతుందనని తహసీల్దార్ పద్మసుందరి తెలిపారు. గురువారం ఆరు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి ప్రొసీడింగ్ పత్రాలు రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ విజయరామారావు, వెంకట్‌రెడ్డి, సీనియర్ సహాయకులు సునీల్, కంప్యూటర్ ఆపరేటర్లు నరేశ్,శంకర్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో ఏడు ..
ఆత్మకూరు(ఎం): ధరణి పోర్టల్ ద్వారా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురు రైతులకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిచేసినట్లు తహసీల్దార్ పి.జ్యోతి తెలిపారు. రెండు గంటలలోపే రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా