జోరుగా ఎన్నికల ప్రచారం

- ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
- జోరుగా ఎన్నికల ప్రచారం
- పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న జిల్లా నాయకులు, నేతలు
మోత్కూరు : అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్ చంపాపేట డివిజన్లోని దుర్గానగర్‌కాలనీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సామా రమణారెడ్డికి మద్దతుగా మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్ని వర్గాల సంక్షేమ కోసం పాటు పడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, నాయకులు రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, పొన్నేబోయిన రమేశ్, గజ్జి మల్లేశ్, నిమ్మల వెంకటేశ్వర్లు, గనగాని నర్సింహ, వెంకన్న, పేలపుడి సత్యనారాయణ చౌదరి, యాదగిరి, దాసరి ప్రవీణ్ పాల్గొన్నారు.
గ్రేటర్ ప్రచారంలో మన లీడర్లు
ఆలేరురూరల్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న చందానగర్ 110 డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మంజులారెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆలేరు మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, కొలనుపాక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మామిడాల భానుచందర్, పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మల్లేశ్ పాల్గొన్నారు.
చందానగర్‌లో జోరుగా ప్రచారం
రాజాపేట: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న చందానగర్110 డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మంజులారెడ్డి గెలుపు కోసం రాజాపేట టీఆర్ఎస్ మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, జడ్పీటీసీ గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణ, సర్పంచ్‌లు ధర్మేందర్‌సింగ్, భాగ్యమ్మ, మధుసూదన్‌రెడ్డి, విజయ, ఈశ్వరమ్మ,రాజు, ధనలక్ష్మి, కరుణాకర్, ఎంపీటీసీలు కవిత, నరేశ్‌రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, ప్రవీణ్, ప్రమోద్‌సింగ్, సంతోశ్‌గౌడ్, స్వామి, తిరుమలేశ్, సిద్ధులు, జశ్వంత్, వీరేశం, ఆబీద్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
ఆత్మకూరు(ఎం): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా చందానగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంజూలరఘునాథరెడ్డిని గెలిపించాలని కోరుతూ టీఆర్ఎస్ యువజన విభాగం మండల నాయకులు ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్ష, కార్యదర్శులు బూడిద శేఖర్, బండసాయిబాబు, నాయకులు పరశురాములు, సత్యనారాయణ, శంతన్రాజు, భగీరథరెడ్డి, హైమద్ పాల్గొన్నారు.
చందానగర్‌లో టీఆర్ఎస్ నాయకుల ప్రచారం
మోటకొండూర్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా చందానగర్‌లో టీఆర్ఎస్ బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థి మంజులారఘునాథ్రెడ్డి గెలుపు కోసం మోటకొండూర్ టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బురాన్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ నర్సింగ్‌యాదవ్, నాయకులు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, మధు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారం
బీబీనగర్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట కార్పొరేట్ అభ్యర్థి సాగర్‌రెడ్డి గెలుపు కోసం మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు పింగళ్‌రెడ్డి, ప్రభాకర్, రాజశేఖర్‌గౌడ్, వైస్ ఎంపీపీ గణేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ లింగయ్యగౌడ్, ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌రాజు, పట్టణ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, టీఆర్ఎస్వీ యూత్వింగ్ నాయకులు నగేశ్, నరేందర్, జనార్దన్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు విస్తృత ప్రచారం
భువనగిరి : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ బలపర్చిన 51వ డివిజన్ కొత్తపేట కార్పొరేటర్ అభ్యర్థిజీవీ సాగర్‌రెడ్డి గెలుపు కోసం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. అంతకు ముందు టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామి, జడ్పీటీసీ బీరుమల్లయ్య, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వెంకట్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాండు, ఓంప్రకాశ్‌గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ మల్లయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రమేశ్‌గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, రాఘవేందర్‌రెడ్డి, వీరేశ్‌యాదవ్, జంగాచారి, సత్యనారాయణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్‌పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు
- సురవరం జయంతి ఉత్సవాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
- 17 అంశాలపై బైడెన్ తొలి సంతకం
- యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ. 64,92,590
- 'అడవుల రక్షణ, పునరుజ్జీవనం ప్రాతిపదికగా అవార్డుల ప్రదానం'