గురువారం 28 జనవరి 2021
Yadadri - Nov 26, 2020 , 00:15:16

ప్రభుత్వ విప్‌ దంపతుల చిత్రపటానికి క్షీరాభిషేకం

ప్రభుత్వ విప్‌ దంపతుల చిత్రపటానికి క్షీరాభిషేకం

మోటకొండూర్‌: మండలంలోని అమ్మనబోలు గ్రామం నుంచి వయా కిషన్‌గూడెం గ్రామం మీదుగా తేర్యాల గ్రామానికి బీటీ రోడ్డు మంజూరుకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షుడు బీస కృష్ణంరాజు తెలిపారు. బుధవారం మండలంలోని అమ్మనబోలు గ్రామంలో సర్పంచ్‌ సిరిపురం నర్మదతో కలిసి ప్రభుత్వ విప్‌ దంపతుల చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మనబోలు, తేర్యాల గ్రామాలకు బీటీ రోడ్డు లేక ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఉండేవని తెలిపారు. పలుమార్లు ప్రభుత్వ విప్‌ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా, రూ. 3కోట్ల నిధుల మంజూరుకి ప్రభుత్వ విప్‌ కృషి చేశారన్నారు. నిధుల మంజూరుకి సహకరించిన మంత్రులు దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జ్యోతిలక్ష్మి, ఉప సర్పంచ్‌ నరేందర్‌, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు సిరిపురం భాస్కర్‌, నాయకులు శిగ శ్రీనాథ్‌, సాయిరెడ్డి నర్సిరెడ్డి, రాంబాబు, కోల కృష్ణ, క్యాసగల్ల కిష్టయ్య, నరేందర్‌, కోల బాలరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.


logo