వెండితెర పండుగ

- త్వరలోనే వెండి తెరపై అభిమాన తారల సినిమాల సందడి..
- సినీ అభిమానులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్
- కరోనా సెకండ్వేను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచన
- జిల్లాలో థియేటర్లను తెరిచేందుకు యాజమన్యాల సన్నాహాలు
- సంతోషం వ్యక్తం చేస్తున్న సినీ అభిమానులు
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : కరోనా కారణంగా 9నెలలగా మూతబడిన సినిమా థియేటర్లు, మల్లీపెక్స్లు త్వరలోనే తెరుచుకోనున్నాయి. థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా సెకండ్వేను దృష్టిలో పెట్టుకుని థియేటర్ల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది. 50శాతం వరకు సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను తెరిచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. థియేటర్ల పునః ప్రారంభంపై నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని సినీరంగ పరిశ్రమకే ప్రభుత్వం అప్పగించింది. పరిశ్రమ వర్గాల నుంచి వెలువడే ప్రకటననుసరించి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 8 సినిమా థియేటర్లను తెరిచేందుకు యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టికెట్ల ధరలు పెంచుకునే అధికారం థియేటర్ల యాజమాన్యాలకే ప్రభుత్వం కల్పించింది. కరోనా వల్ల థియేటర్ల నిర్వాహకులు కుదేలవ్వగా.. థియేటర్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కార్మికుల జీవితాల్లో చీకట్లు కమ్ముకోగా.. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో ఆయా వర్గాలు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమ అభిమాన హీరోల సినిమాలను వెండి తెరపె ఎప్పుడెప్పుడు చూస్తామన్న ఆతృత సైతం అభిమానుల్లో నెలకొంది.
ఈ నిబంధనలు పాటించాల్సిందే..
త్వరలోనే సినిమా థియేటర్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలు, ప్రేక్షకులు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లో పనిచేసే వ్యక్తులు మొదలుకుని.. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల దాకా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. శానిలైజర్ను తప్పనిసరిగా వినియోగించాలి. సీటింగ్ విషయంలో, లోపలకు, బయటకు వెళ్లే సమయంలో భౌతిక దూరం నిబంధనలను సైతం తప్పక పాటించాలి. థియేటర్ హాల్లో ఏసీ టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
సినిమా చూసే అవకాశం వచ్చింది
రాజాపేట : లాక్‌డౌన్‌తో మూసిపడిన సినిమా హాల్ మళ్లీ తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం. ఇన్ని రోజులకు మళ్లీ సినిమా చూసే అవకాశం రావడం ఆనందంగా ఉన్నది. సినిమా థియేటర్లు మూసివేయడంతో అభిమాన హీరో సినిమాలు చూడలేకపోయాం. మళ్లీ అభిమాన నటుల సినిమాలు చూసే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
- ఎర్రగోకుల రాజు, రాజాపేట
సీఎం కేసీఆర్ నిర్ణయానికి హర్షం
గుండాల : కరోనా నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో సినిమా రంగం పూర్తిగా నిలిచిపోయింది. ఆ రంగంపై బతికే కార్మికులు రోడ్డునపడ్డారు. ఈ నేపథ్యంలో వారికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పడం, ఆయన తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి ఫ్యాన్స్‌గా హర్షిస్తున్నాం. సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది కార్మికులకు రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు మంజూరును పూర్తిగా స్వాగతిస్తున్నాం.
- పి. మధు, చిరంజీవి ఫ్యాన్, గుండాల
కొవిడ్‌తో సినీ పరిశ్రమకు నష్టం
ఆలేరురూరల్ : కొవిడ్‌తో సినీ పరిశ్రమ ఎంతో నష్టపోయింది. సీఎం కేసీఆర్ థియేటర్ తెరిచేందుకు అనుమతివ్వడం సంతోషంగా ఉన్నది. సినీ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలను కల్పిస్తుంది. అంతే కాకుండా సినిమా థియేటర్లు మూతపడ్డ కాలానికి కనీస విద్యుత్ చార్జీలు రద్దు చేయడం ఎంతో ఉపశమనాన్ని కలిగించినట్లే. సినీ పరిశ్రమపై రాష్ట్రంలో 40వేల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు.
- మిట్టపల్లి సతీశ్, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కొలనుపాక
సినిమా రంగాన్ని ప్రోత్సహించడం సంతోషం
భువనగిరి అర్బన్: కరోనాతో దెబ్బతిన్న సినిమా రంగాన్ని ప్రోత్సహించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్లకు లాక్డౌన్ సమయంలో విద్యుత్ కనీస చార్జీలు రద్దు చేయడంతో సినిమా థియేటర్ల సంఘాలు, సినీరంగ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీరంగ కార్మికులు లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సినీ రంగ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు అందించడంతో సంతృప్తి చెందుతున్నారు. థియేటర్లకు అనుమతి రావడం, సినీ రంగాన్ని ఆదుకోవడం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా కృష్ణ -మహేశ్ సేనా ఫ్యాన్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా.
- పిట్టల బాల్‌రాజ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా కృష్ణ-మహేశ్ సేనా ఫాన్స్ అధ్యక్షుడు
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఆత్మకూరు(ఎం): లాక్‌డౌన్‌తో మూతపడిన సినిమా థియేటర్లను మళ్లీ తెరుచుకునే విధంగా ప్రభుత్వం అనుమతివ్వడం హర్షణీయం. 6 నెలల తరువాత వినోదాన్ని మళ్లీ సినిమా థియేటర్లలో చూడబోతుండటం సంతోషంగా ఉంది. అనేక మందికి జీవనోపాధి కూడా కలుగనున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
- గంగారపు భిక్షపతి, సినీ హీరో చిరంజీవి అభిమాని ఆత్మకూరు(ఎం)
తాజావార్తలు
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
- ‘జాతి రత్నాలు’ బిజినెస్ అదుర్స్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి
- రూ.5.85 లక్షల కోట్ల రుణాల రద్దు!