సోమవారం 08 మార్చి 2021
Yadadri - Nov 24, 2020 , 00:03:26

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి  కృషి

ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌

బీబీనగర్‌:  సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తానని ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌ అన్నారు.  మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సమస్యలను ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు. భట్టుగూడెంలో వీధి లైట్లు నిరంతరంగా వెలుగుతున్నాయని సర్పంచ్‌ గెగ్గలపల్లి మాధవీపురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్‌ ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు.  పాల్వాయిగూడెంలో 24 గంటల విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. గుర్రాలదండి, రావిపహాడ్‌తండా, రామునిగుండ్లతండా, పెద్దపలుగుతండా పరిధిలో బొల్లెపల్లి కాల్వకు గండ్లు పడ్డాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులను కోరారు.  ఇటీవల కురిసిన వర్షాలకు చిన్నరావులపల్లి-రాఘవాపురం రోడ్డు మధ్య ఉన్న కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోయిందని,  వెంటనే పునరుద్ధరించాలని సర్పంచ్‌ బక్కన బాలమణిదేవదాసు  అధికారులను కోరారు.  రుద్రవెళ్లి మూసీ బ్రిడ్జి నిర్మాణ పనులను   ప్రారంభించాలని సర్పంచ్‌ మన్నె రాజేందర్‌ కోరారు. సమావేశంలో జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో మజీద్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo