గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 22, 2020 , 00:21:32

రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

  • 23 నుంచి ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు
  • ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు
  • ధరణి పోర్టల్‌కు  పెరిగిన ఆదరణ

భువనగిరి : వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. పెరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే భూముల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు విడుదల చేసి ధరణి పోర్టల్‌ను రూపొందించింది. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. అయితే ప్రభుత్వం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు వేగంగా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి అధికారులతో క్షేత్రస్థాయి సమావేశం నిర్వహించి చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌కు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ క్రమంలో ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌, మోత్కూరు, యాదగిరిగుట్ట, బీబీనగర్‌, రామన్నపేట మండలాల్లోని ఆరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. 

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు  ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న వ్యసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆయాశాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా చకచకా పనులు  చేస్తున్నారు.

రెండున్నర నెలల తర్వాత..

ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ప్రారంభించేందుకు చర్యలు చేడుతున్న తరుణంలో భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ముందుస్తు చర్యల్లో భాగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సెప్టెంబర్‌-8 నిలిపివేసింది.  ఈనెల 2న ధరణి పోర్టల్‌ను ప్రారంభించడంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ధరణిపోర్టల్‌ విజయవంతంగా ముందుకు సాగుతుండటంతో   ప్రభు త్వం మరో అడుగు ముందు కేసి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు 

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు వేగవంతంగా  జరుగుతున్నా యి.  ప్రభుత్వ ఆదేశాల మేర కు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తాం. క్షేత్ర స్థాయిలో విజయవంతంగా పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటాం. 

-రంగ మదన్‌గౌడ్‌, సబ్‌రిజిస్ట్ట్రార్‌, భువనగిరి


VIDEOS

logo