వైభవంగా నిత్య కల్యాణం

పెద్ద ఎత్తున పూజలు చేసిన భక్తులు
యాదాద్రి పునర్నిర్మాణ పనులపై అధికారుల ఆరా
కొనసాగుతున్న కార్తిక పూజలు
ఆలేరు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మహామంటపంలో ఆలయ అర్చకులు సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. బాలాయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, ఆరాధన చేపట్టారు. పంచామృతాలతో అభిషేకించి పట్టువస్ర్తాలు ధరింపజేసి అర్చన జరిపారు. ఉత్సవమూర్తులను తులసీదళాలతో అర్చించి అష్టోత్తరం నిర్వహించారు. స్వామివారికి సాయంత్రం, రాత్రి ఆరాధన, శయనోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కార్త్తిక మాసం.. దీపారాధన
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తికమాసం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలతో పాటు సేవలు నిర్వహించారు. అర్చనలు, అష్టోత్తరాలు, సహస్రనామార్చనలు, సువర్ణ పుష్పార్చనలు చేసి అనంతరం హోమం నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా దీపారాధనలో మహిళలు పాల్గొన్నారు.దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవారి ఖజానాకు
రూ. 8,05,248 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 8,05,248 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 81,898, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 28,000, ప్రచారశాఖ ద్వారా రూ. 3,300, వ్రతాల ద్వారా రూ. 1,28,000, కల్యాణ కట్ట ద్వారా రూ. 22,400, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 3,82,320, శాశ్వత పూజల ద్వారా రూ. 13,116, మినీబస్సుల ద్వారా రూ. 1,960, వాహనపూజల ద్వారా రూ. 12,500, టోల్గేట్ ద్వారా రూ. 1,390, ఇతర విభాగాలు రూ. 1,30,264లతో కలిపి రూ. 8,05,248 ఆదాయం వచ్చినట్లు ఆమె తెలిపారు.
ఆలయ నిర్మాణ పురోగతిపై ఆరా
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులపై వైటీడీఏ అధికారులు గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. యాదాద్రి ప్రధానాలయం, గర్భాలయం, మాఢవీధులు, మండపాలు, ప్రాకారాలు, ఫ్లోరింగ్ పనులు, శివాలయం, క్యూ కాంప్లెక్స్, విష్ణుపుష్కరిణి పనులను వైటీడీఏ టెక్నికల్ కమిటీ సభ్యులు కొండల్రావు, స్థపతి సలహాదారు డాక్టర్ ఆనందాచార్యుల వేలు, ఆలయ ఈవో గీత, ఆర్కిటెక్ట్ ఆనందసాయి పరిశీలించారు. సుమారు 3 గంటల పాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల తీరు, నాణ్యతా ప్రమాణాల్లో చేపడుతున్న చర్యలపై సమీక్ష చేశారు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం