శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 19, 2020 , 00:50:39

నాణ్యతాప్రమాణాలతో మద్దతు ధర

నాణ్యతాప్రమాణాలతో మద్దతు ధర

ఆలేరు టౌన్‌ : నాణ్యతాప్రమాణాలు పాటిస్తే పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆలేరులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. ఏరివేత అనంతరం పత్తిలో తేమ శాతం తగ్గించేందుకు ఆరబెట్టాలన్నారు. అలాగే పత్తిలో ఆకులు, చెత్త, అపరిపక్వమైన కాయలను వేరు చేయడంతో పాటు నాణ్యమైన పత్తిని గుర్తించి వేరు చేయాలన్నారు. ఇప్పటి వరకు మండలంలోని మూడు కొనుగోలు కేంద్రాల నుంచి 16,992.55 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశామన్నారు. రూ.9,68,66,984 చెల్లించాల్సి ఉన్నదన్నారు. రైతుల అకౌంట్లలో రెండు రోజుల్లో డబ్బులు జమ కానున్నట్లు తెలిపారు.

VIDEOS

logo