మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Nov 17, 2020 , 00:11:03

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బొమ్మలరామారం: రైతులు  ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని పీఏసీఎస్‌ చైర్మన్‌ గూదెబాల నర్సయ్య అన్నారు. మండలంలోని జలాల్‌పూర్‌లో సోమవారం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..గిట్టుబాటు ధర పొందాలంటే ప్రభుత్వ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గుమ్మడి మహేందర్‌రెడ్డి, ఈరేకార్‌ నాగరాజు,  ఉప సర్పంచ్‌ జూపల్లి భరత్‌, మన్నె శ్రీధర్‌,  సంజీవరెడ్డి, సెంటర్‌ ఇన్‌చార్జి బండి మహేశ్‌గౌడ్‌, మోటే యాదగిరి, వీరేశం పాల్గొన్నారు. 

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి 

ఆలేరు రూరల్‌: మండలంలోని కొలనుపాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఏవో లావణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర దక్కాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు పూర్తిగా ఎండబెట్టి మట్టిపెల్లలు, తేమ లేకుండా చూసుకోవాలన్నారు. ఆమె వెంట పలువురు రైతులు ఉన్నారు. 

మాజీ ఎంపీటీసీకి మాతృవియోగం 

ఆలేరు టౌన్‌ : ఆలేరు మున్సిపల్‌ పరిధిలోని సాయిగూడెంలో మాజీ ఎంపీటీసీ, టీఆర్‌ఎస్‌ నాయకుడు పుట్ట మల్లేశం తల్లి గంగమ్మ (78) సోమవారం చనిపోయింది. గంగమ్మ మృతిపట్ల ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ గంగమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గంగమ్మ అంత్యక్రియల్లో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo