ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 16, 2020 , 00:31:17

రైతుల సంక్షేమానికి పెద్దపీట

రైతుల సంక్షేమానికి పెద్దపీట

సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి 

చౌటుప్పల్‌: రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి అన్నారు. స్థానిక సింగిల్‌విండో కార్యాలయంలో సంఘం వారోత్సవాలను శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా  జెండా ఆవిష్కరించి జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డి, సిబ్బంది రమేశ్‌, చంద్రయ్య, మహేశ్‌ పాల్గొన్నారు. 

అందుబాటులో వరి విత్తనాలు

చౌటుప్పల్‌ సింగిల్‌విండో కార్యాలయంలో అన్ని రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు సంఘం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 

సంస్థాన్‌నారాయణపురంలో...

సంస్థాన్‌నారాయణపురం: రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయమని నారాయణపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ జక్కిడి జంగారెడ్డి అన్నారు.67వ అఖిల భారత సహకర వారోత్సవాలను పురస్కరించుకుని  మండల కేంద్రంలోని  పీఏసీఎస్‌ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహకార సంఘాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ లచ్చిరాంనాయక్‌, డైరెక్టర్లు బోడ్డుపళ్లి గాలయ్య, గడ్డం పెంటయ్య, అంజయ్య, సీఈవో శేఖర్‌, యాదయ్య, శంకర్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.  

రామన్నపేటలో .. 

రామన్నపేట: మండలంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో శనివారం సహకార సంఘం వారోత్సవాలు ప్రారంభించారు.  చైర్మన్‌ నంధ్యాల భిక్షంరెడ్డి డైరెక్టర్లతో కలిసి సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు. సీఈవో జంగారెడ్డి, డైరెక్టర్లు కన్నెకంటి వెంకటేశ్వరాచారి, నాగు ఆంజనేయులు, నక్క యాదయ్య, కొండల్‌రెడ్డి, కొమ్ము అంజమ్మ, బొడ్డు సాయిలు పాల్గొన్నారు.

అడ్డగూడూరులో..

అడ్డగూడూరు : 67వ  సహకార సంఘం వారోత్సవాలను మండలంలోని సింగిల్‌ విండో కార్యాలయంలో జరుపుకున్నారు. కార్యాలయం ఎదుట శనివారం సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పోగుల నర్సిరెడ్డి, అశోక్‌రెడ్డి, వేముల భిక్షం,ఎల్లంల వీరస్వామి,సీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సహకార సంఘాలను సద్వినియోగం చేసుకోవాలి  

మోత్కూరు : సహకార సంఘాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మోత్కూరులో  రైతు సేవా సహకార సంఘం వద్ద ఆయన జెండా ఆవిష్కరించారు.   సంఘం వైస్‌ చైర్మన్‌ మధు, సంఘం డైరెక్టర్లు సామ పద్మారెడ్డి, పురుగుల మల్లయ్య, జిట్ట లక్ష్మయ్య, సీఈవో వరలక్ష్మి, మేనేజర్‌ వీరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo