మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Nov 14, 2020 , 00:46:47

‘ధరణి’ని సద్వినియోగం చేసుకోవాలి

‘ధరణి’ని సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. శుక్రవా రం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ పక్రియను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాం టి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దళారీ వ్యవస్థ పూర్తిగా రద్దుకానుందని చెప్పారు. మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకుని, నిర్దేశిత రోజున జాప్యం లేకుండా అతి తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్‌ పక్రియను పూర్తి చేసి ప్రొసీడింగ్‌ కాపీని అందజేస్తున్నారని అన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ జనార్దన్‌రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo