బుధవారం 27 జనవరి 2021
Yadadri - Nov 13, 2020 , 02:30:01

ధరణితో సమస్యలు పరిష్కారం : కలెక్టర్‌

ధరణితో సమస్యలు పరిష్కారం : కలెక్టర్‌

బొమ్మలరామారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను, ధరణి రికార్డులను ఆమె పరిశీలించారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన రైతులను ధరణి సేవలు, రిజిస్ట్రేషన్‌ సౌకర్యాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి సాంకేతిక సమస్యలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్‌ అవుతున్నందున రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పద్మసుందరి, ఆర్‌ఐ విజయరామారావు, సునీల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నరేశ్‌, శంకర్‌, రైతులు పాల్గొన్నారు. 

బొమ్మలరామారంలో ఆరు..

ధరణి పోర్టల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న ఆరింటికి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి చేసి రైతులకు గురువారం ఈ-పాస్‌బుక్‌లు అందజేసినట్లు తహసీల్దార్‌ పద్మసుందరి తెలిపారు. 


logo