ఇంటికే పాసు బుక్కులు : అదనపు కలెక్టర్

ఆలేరు : ధరణి రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే వారం రోజుల్లో ఇంటికే ఒరిజినల్ పట్టాదారు పాసుబుక్కులు వస్తాయని, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేదని అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ స్పష్టం చేశారు. గురువారం యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. ధరణి సేవలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క రూపాయిని కూడా అధికారులకు ఇవ్వొద్దని, ఆన్లైన్లో పొందుపర్చిన చార్జీలు చెల్లిస్తే చాలన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ధరణి సేవలను తీసుకొచ్చిందన్నారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌రెడ్డి, డీటీ నర్సింహారావు, ధరణి ఆపరేటర్ నవీన్ తదితరులు
పాల్గొన్నారు.
తాజావార్తలు
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు