అటవీశాఖలో అమరుల జ్ఞాపకార్థం స్మృతివనం

రెండెకరాల్లో.. చౌటుప్పల్‌లో ఏర్పాటు
రెండేండ్ల కింద ప్రారంభం.. నాటినవి 47 మొక్కలు
చౌటుప్పల్ : అటవీశాఖలో పనిచేస్తూ అమరులైన వారి జ్ఞాపకార్థం ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటగా అటవీశాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో స్మృతి వనం ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ కేంద్రంలోని వలిగొండ చౌరస్తా పక్కన రెండు ఎకరాల విస్తీర్ణంలో 2018 సెప్టెంబర్ 11న ఈ వనం ప్రారంభమైంది. ఈవనంలో ఫారెస్ట్‌శాఖ అమరవీరులతో పాటు ప్రజలు తమ బంధువుల జ్ఞాపకార్థం ఇక్కడ మొక్కలు నాటవచ్చు. ఈ వనంలో మొక్కను నాటాలనుకునేవారు ఆంధ్రబ్యాంక్‌లో డీఎఫ్‌వో పేరుతో రూ.5వేల డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ తీసిన వెంటనే వారి బంధువుల పేరుతో మొక్క నాటి పూర్తి సంరక్షణ బాధ్యత చేపడుతారు. వనంలో నాటిన మొక్కలు వారికి సంబంధించిన వారసులు తరతరాలు చూసుకునేందుకు వీలుకలుగుతుంది. స్మృతి వనం ఏర్పాటుతో అటవీశాఖకు ఆదాయంతో పాటు అదే ప్రాంతంలో ఒకరికి జీవన భృతి దొరుకుతుంది.
ప్రజల నుంచి మంచి స్పందన..
మరణించిన తమ తల్లిదండ్రులతో పాటు బంధువుల పేరుతో మొక్కలు నాటేందుకు చౌటుప్పల్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మృతి వనానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. స్మృతి వనంపై ప్రజలకు అటవీశాఖ అధికారులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇక్కడ మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపుతున్నారు. అటవీశాఖలో పనిచేస్తూ అమరులైన వారి జ్ఞాపకార్థం ఈవనంలో ఇప్పటికే 22 మొక్కలు నాటారు. అంతేకాకుండా రెండేండ్ల వ్యవధిలోనే వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ బంధువుల పేర్లతో 47 మొక్కలు నాటగా..అటవీశాఖకు రూ. 2లక్షల 35వేల ఆదాయం వచ్చింది. తమ బంధువుల రాశిపేర్ల మీద మొక్కలు నాటేందుకు అటవీశాఖ వెసులుబాటు కల్పించింది. ప్రధానంగా ఈ వనంలో మామిడి, ఉసిరి, వేప, నేరడి, ఏడాకుల పాలం తదితర మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటుతుండగా వస్తున్న డబ్బులతో నాటిన మొక్కల సంరక్షణ చేపడుతున్నారు. మొక్కలను పకడ్బందీగా పెంచేందుకు, వాటిని కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రత్యేక వాచర్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాటిన ప్రతి మొక్క రికార్డు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నాటిన వారి వారసులు ఎప్పుడైనా చూసుకునేందుకు వీలుగా రికార్డులు నిర్వహిస్తున్నారు.
ఆకర్షణగా వాకింగ్ ట్రాక్..
చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన స్మృతి వనం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వివిధ రకాలైన మొక్కలతో వనం చూపరులకు కనువిందు చేస్తుంది. ఇప్పటికే ఈ వనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. స్థానికులు ఉదయం, సాయంత్రం ఈ వనంలో వాకింగ్ చేసుకునేందుకు వీలుగా 5 ఫీట్ల వెడల్పుతో 600 మీటర్ల వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొక్కలు నాటేందుకు వచ్చిన వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక కుటీరాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాలోనే మొదటి వనం
జిల్లాలోనే ప్రప్రథమం గా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేశాం. అటవీశాఖ అమరవీరుల జ్ఞాపకార్థం ఈ వనాన్ని ఏర్పాటు చేశాం. అమరవీరులతో పాటు ప్రజలు ఇక్కడ మొక్కలు నాటేందుకు అవకాశం కల్పించాం. ప్రజలు తమ బంధువుల పేర్ల మీద మొక్కలు నాటేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు.
-వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎఫ్‌వో
47 మొక్కల పెంపకం
స్మృతి వనంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల ప్రజలు తమ బంధువుల జ్ఞాపకార్థం మొ క్కలు నాటుతున్నారు. ఇప్పటికే 47 మొక్కలను పెంచుతున్నాం. మొక్కల సంరక్షణకు ప్రత్యేక వాచర్‌ను నియమించాం. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
- వెంకట్రాములు, డిప్యూటీ ఎఫ్ఆర్వో
తాజావార్తలు
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
- నాణ్యమైన పరిశోధనలు జరగాలి: ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
- బండ చెరువు నాలా పనులను జీహెచ్ఎంసీకి అప్పగించాలి
- రాజకీయ దురుద్దేశంతోనే ర్యాంకింగ్‌ను తగ్గించారు
- వృద్ధులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే టీకాలు వేయాలి
- బీజేపీ ద్వంద్వ విధానాల్ని ఎండగట్టాలి
- అభివృద్ధి కావాలా..? అబద్ధాలు కావాలా..?
- తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు..