బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 11, 2020 , 00:05:33

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి

మోత్కూరు : మోత్కూరు మండలం అనాజీపురం, కొండగడపలోని రైతు సేవా సంఘం (ఎఫ్‌ఏసీఎస్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పండించే రైతులు దళారీలను నమ్మి మోసపోవద్దని, సింగిల్‌ విండో, ఐకేపీ సెంటర్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలన్నారు. రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అనాజీపురంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ కంచర్ల అశోక్‌రెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ కొండ సోంమల్లు, మున్సిపాలిటీ చైర్మన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ పెలపూడి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్‌, 4వ వార్డు కౌన్సిలర్‌ ఎర్రవెల్లి మల్లమ్మ, సీఈవో కొణతం వరలక్ష్మి, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, అనాజీపురం సర్పంచ్‌ ఉప్పల లక్ష్మీయాదయ్య, ఉపసర్పంచ్‌ దేవర శ్రీశైలం, కొప్పుల విద్యాసాగర్‌రెడ్డి, బీంరెడ్డి మోహన్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు 

పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

అడ్డగూడూరు : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం మండలంలోని లక్ష్మీదేవికాల్వ, కంచనపల్లి గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుకాలం కష్టపడి పండించిన పంటను రైతులు దళారుల పాలు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాములు జ్యోతిఅయోధ్య, సర్పంచ్‌ నారగోని అంజయ్య, ఎంపీటీసీ చిగుల్ల ఉపేంద్ర, సీఈవో వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.

VIDEOS

logo