మంత్రులకు ఘన స్వాగతం

ఆలేరు: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బస్ టెర్నినల్, డిపో నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం యాదగిరిగుట్టలో మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యురాలు పద్మ, డైరెక్టర్ అయిలయ్య, నాయకులు వెంకటయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.
రోడ్డు మరమ్మతుల కోసం మంత్రికి వినతి
ఆలేరు టౌన్ : ఆలేరు పట్టణంలోని సాయిబాబా గుడి నుంచి దుర్గమ్మగుడి వరకు రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరుతూ ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి మంగళవారం రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అలాగే బస్టాండ్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని, సుమారు రూ. 12కోట్ల 25లక్షల అంచనా వ్యయంతో రైల్వే గేట్, వివేకానంద విగ్రహం నుంచి మంతపురి వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. ఇందుకు సంబంధించి మంత్రి సానుకూలంగా స్పందించారని చైర్మన్ శంకరయ్య తెలిపారు.
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు