మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Nov 11, 2020 , 00:08:36

రైతులు దళారులను ఆశ్రయించొద్దు

రైతులు దళారులను ఆశ్రయించొద్దు

సీసీ బ్యాంక్‌ చైర్మన్‌ 

చింతలపూరి భాస్కర్‌రెడ్డి 

రాజాపేట: రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యం విక్రయించవద్దని సీసీ బ్యాంక్‌ చైర్మన్‌ చింతలపూరి భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు మద్దతు ధర పొందాలంటే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పంబ కరుణాకర్‌, ఎంపీటీసీ ల్యాగల శ్రీలత, సీసీ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ కాకల్ల ఉపేందర్‌, నాయకులు బోగ హరినాథ్‌, సత్తిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

గుండాల: మండలంలోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు మంగళవారం ఎంపీపీ  అమరావతి , జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ.ఖలీల్‌  తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ  సుద్దాలలో ఉదయం 10 గం టలకు, గుండాలలో ఉదయం 11 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని తెలిపారు.

 కొల్లూరు, గోలనుకొండ గ్రామాల్లో...

ఆలేరురూరల్‌: మండలంలోని కొల్లూరు, గోలనుకొండ గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రారంభిస్తారని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశ్‌గౌడ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

VIDEOS

logo