శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 11, 2020 , 00:08:34

రోటరీ క్లబ్‌ సేవలు అభినందనీయం

రోటరీ క్లబ్‌ సేవలు అభినందనీయం

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ఆలేరు: రోటరీ క్లబ్‌ సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్టాండ్‌లో రోటరీ క్లబ్‌ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మదర్‌ ఫీడింగ్‌ సెంటర్‌ను  ఆమె ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఇలాంటి సేవలను మరింత  విస్తృతం చేయాలని కోరారు.  ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్‌లో మదర్‌ ఫీడింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ భువనగిరి శాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ఇరుకుల రామకృష్ణ, కోశాధికారి బండారు బాలరాజు, ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ వెంకన్న, డిపో మేనేజర్‌ రఘు, రోటరీక్లబ్‌ గవర్నర్‌ కొక్కలకొండ నిమ్మయ్య  పాల్గొన్నారు.

VIDEOS

logo