సోమవారం 01 మార్చి 2021
Yadadri - Nov 10, 2020 , 01:10:04

గొంగిడి దంపతులపై అసత్య ఆరోపణలు తగదు

గొంగిడి దంపతులపై అసత్య ఆరోపణలు తగదు

టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ 

ఆలేరు టౌన్‌ :   మండలంలోని గొలనుకొండలో పేదల నివాస స్థలాల విషయంలో ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి దంపతులపై అసత్య ఆరోపణలు చేయడం తగదని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ హితవు పలికారు. ఆలేరులో సోమవారం గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు, రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో 1994లో అప్పటి ప్రభుత్వం ఇండ్లు నిర్మించుకునేందుకు పట్టాలు ఇవ్వడం జరిగిందని.. నాటి నుంచి నేటి వరకు అక్కడ పేదలు ఇండ్లు నిర్మించుకోలేదన్నారు. దీంతో ఇటీవల కొందరు రైతులు అక్కడ ధాన్యం ఆరబోసుకుంటే డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రకటనలు ఇవ్వడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో డీసీసీబీ చైర్మన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సమావేశంలో   పీఏసీఎస్‌ చైర్మన్‌  మల్లేశం,సర్పంచ్‌  లక్ష్మి,   టీఆర్‌ఎస్‌ గ్రామ ప్రెసిడెంట్‌   శ్రీను, ఎంపీటీసీ లక్ష్మి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌  భిక్షపతి, కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు  కృష్ణమూర్తి, నాయకులు తిరుపల్లి సురేందర్‌రెడ్డి,  ఆంజనేయులు,  రాములు,  స్వామి పాల్గొన్నారు. 

VIDEOS

logo