ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు మంజూరు

తుర్కపల్లి : నియోజకవర్గం వ్యాప్తంగా 28 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలంలోని గోపాల్పూర్, మల్కాపూర్ గ్రామాల్లో మంజూరైన ట్యాంకుల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు. అదే విధంగా యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి నుంచి రాంపూర్ వరకు బీటీ రోడ్డు మంజూరైందన్నారు. దయ్యంబండతండా బీటీ రోడ్డు నిర్మాణానికి గతంలోనే నిధులు మంజూరుకాగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ఆలస్యమయ్యాయని, త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ముల్కలపల్లి నుంచి రామోజీనాయక్‌తండా గొల్లగూడెం వరకు, కరకపట్ల నుంచి వయా నాగాయపల్లితండా, తిమ్మాపూర్ వరకు రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించి కుటుంబాల స్థితిగతులు తెలుసుకునేందుకు గ్రామంలో పర్యటించామన్నారు. మండల కేంద్రంలో త్వరలోనే ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటవుతుందన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ.ప్రభుత్వ విప్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు