గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 09, 2020 , 01:06:52

నిధుల మంజూరుపై హర్షం

నిధుల మంజూరుపై హర్షం

ఆలేరు : గత నెలలో కురిసిన వర్షానికి శిథిలావస్థకు గురవుతున్న బీటీ రోడ్లు, స్లాబ్‌ కల్వర్టు పునరుద్ధరణతో పాటు నూతన బీటీ రోడ్లకు పీఎంజీఎస్‌వై పథకం కింద రూ.7 కోట్ల నిధులు మంజూరు కావడం హర్షించదగ్గ విషయమని బాహుపేట సర్పంచ్‌ కండె పద్మానర్సయ్య అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రూ. 2 కోట్లతో పెద్దకందుకూరు తాళ్లగూడెం మధ్య పెద్దవాగు స్లాబ్‌ కల్వర్టు పునరుద్ధరణ, రూ.5 కోట్లతో కాచారం మాసాయిపేట లింకురోడ్డు, కుమ్మరిగూడెం, యాసోజిగూడెం, బాహుపేట, తాళ్లగూడెం పెద్దకందుకూరు గ్రామాల్లో బీటీ ఆధునీకరణతోపాటు నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఇందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వే కూడా నిర్వహించారని తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాహుపేట ఉపసర్పంచ్‌ గొల్లపల్లి బాబు, తాళ్లగూడెం ఉపసర్పంచ్‌ సిద్ధులు, నాయకులు సత్తయ్య, మహేందర్‌, కృష్ణారెడ్డి, కృష్ణా, శ్రీనివాస్‌గౌడ్‌, రాంచందర్‌, బాలరాజు పాల్గొన్నారు.

ప్రభుత్వవిప్‌నకు కృతజ్ఞతలు..

బొమ్మలరామారం : మండలంలోని తిరుమలగిరి నుంచి హాజీపూర్‌ గ్రామం వరకు శామీర్‌పేట్‌ వాగుపై బ్రిడ్జితో సహా మాచన్‌పల్లి ఎక్స్‌రోడ్డు వరకు బీటీ రోడ్డు మంజూరు కావడంపై ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేస్తూ నిధుల మంజూరుకు కృషిచేసిన ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్‌ ప్రత్యేక చొరవ తీసుకొని పీఎం గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద రూ.6.5 కోట్ల నిధుల మంజూరు చేయించారన్నారు. మండల ప్రజల చిరకాల వాంఛ అయిన రోడ్డు నిర్మాణం పూర్తి అయితే 10గ్రామాల ప్రజలు, రైతులకు జిల్లాకేంద్రానికి 6కి.మీ ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ప్రయాణ సమస్యలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌, భువనగిరి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రామిడి రాంరెడ్డి, ఉప సర్పంచ్‌ జూపల్లి భరత్‌, గ్రామశాఖ అధ్యక్షుడు పాపిరెడ్డి, యూత్‌ అధికార ప్రతినిధి మహేశ్‌గౌడ్‌, పాండు, శ్రీకాంత్‌ గౌడ్‌, ఉపేందర్‌, రామస్వామి, సాయి, కార్తీక్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo