ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Nov 07, 2020 , 00:43:27

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

చౌటుప్పల్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ జిల్లా అధికారి ఎంఏ అలీం, ఏవో నాగరాజు, సీసీఐ ఇన్‌చార్జి సాంబశివరావు, నాయకులు భాస్కర్‌, వెంటకన్న, మల్లేశం, చీరిక సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo