ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 07, 2020 , 00:43:27

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

మోత్కూరు : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించాలన్నారు. ధాన్యంలో తేమ లేకుండా శుభ్రం చేసుకొని మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,888 చొప్పున పొందాలన్నారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కొండేటి స్వాతి, మున్సిపల్‌ చైర్మన్‌ తీపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కొణతం యాకూబ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్ష, కార్యదర్శులు రమేశ్‌, మల్లేశ్‌, రైతుబంధు కో-ఆర్డినేటర్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, సోంమల్లు, తహసీల్దార్‌ షేక్‌ అహ్మద్‌, మార్కెట్‌ కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, ఏవో స్వప్న, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ పట్టణ అధ్యక్షుడు కల్యాణ్‌ చక్రవర్తి, పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి..

మోత్కూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మోత్కూరు మున్సిపాలిటీ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.లక్షా పై నిధులతో చేపట్టనున్న ప్రతి పనిని ఆన్‌లైన్‌ టెండర్‌ ద్వారా అగ్రిమెంట్‌ చేసుకుని నిర్వహించాలన్నారు. రూ.88 లక్షలతో నిర్మాణం చేయనున్న మురికి కాల్వలు, అంతర్గత సీసీరోడ్ల నిర్మాణ పనులను కూడా మున్సిపల్‌ కమిషనర్‌, కౌన్సిల్‌ సమావేశం ఆమోదం పొందినందున ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లను పిలిచి అగ్రిమెంట్‌ చేసి పనులను త్వరతగతిన చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద మంజూరైన నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గుర్తించిన పనులను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా సబ్‌రిజిస్ట్రారు కార్యాలయం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కు ఏర్పాటు చేయాలన్నారు. బుజిలాపురంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి పైపులైన్‌ పనులకు కౌన్సిల్‌ సమావేశంలో తీర్మాణం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంగీసమ్మ కుంట నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు ఉన్న మట్టి రోడ్డుకు పడిన గుంతలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని చిరువీధి వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వెంకటయ్య, కౌన్సిలర్లు వెంకన్న, కల్యాణ్‌ చక్రవర్తి, విజయారమేశ్‌, శిరీష, కవిత, ఎం రజిత, కో-ఆప్షన్‌ సభ్యులు నర్సింహ, ఎండీ అబ్దుల్‌ నబీ, కమిషనర్‌ మహ్మద్‌, మేనేజర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo