ధరణి అదిరింది

- కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు
- అరగంటలోనే పని పూర్తి
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
మండల కేంద్రానికి చెందిన ఏనుగు నాగమ్మకు మండల కేంద్రంలో 2.16 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. తన పేరు మీద ఉన్న భూమిని ముగ్గురు కొడుకులకు పట్టా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నది. కానీ ఆమెకు ఆరోగ్యం సహకరించక పోవడంతోపాటు రిజిస్ట్రేషన్ కోసం మండలం నుంచి 11కి.మీల దూరంలో ఉన్న చౌటుప్పల్ రావాల్సి ఉండటం, ఆఫీసుల చుట్టూ తిరగవలసి వస్తుందని కొడుకులు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి సేవలో భాగంగా బుధవారం కొడుకులు స్లాట్ బుక్ చేయగా, గురువారం ఉదయం కొడుకుల సహాయంతో ఏనుగు నాగమ్మ సంస్థాన్ నారాయణపురం తాసీల్దార్ కార్యాలయనికి వచ్చింది. సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి చేసి అరగంటలో నాగమ్మ నుంచి ముగ్గురు కొడుకులకు 32 గుంటల చొప్పున భూమిని బదలాయించి ఈ- పాస్ బుక్‌లను అందజేశారు. నాగమ్మ తన ముగ్గురు కొడుకులకు భూమి పట్టా చేస్తానని అనుకోలేదు. కేవలం అరగంటలో అధికారులు రిజిస్ట్రేషన్ చేసి పాసుపుస్తకాలు అందజేయడంతో నాగమ్మ మురిసి పోయింది.
భూదాన్‌పోచంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌లో గురువారం భూదాన్‌పోచంపల్లిలో మొదటి రిజిస్ట్రేషన్ నమోదు అయ్యింది. జూలూరుకు చెందిన పుడుత నర్సింహకు చెందిన 2 ఎకరాల 24 గుంటల భూమిలో తన చిన్న కొడుకు పుడుత గణేశ్ పేరున 26 గుంటల భూమిని మార్పు చేసే క్రమంలో గురువారం 26 గుంటల భూమిని ధరిణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే అధికారులు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నర్సింహ పట్టాదారు పాసు పుస్తకంలో నుంచి 26 గంటలను అమ్మినట్లుగా తొలగించి గణేష్‌కు 26 గుంటలకు చెందిన 1బీ( భూమి యాజమాన్య హక్కు) పత్రాన్ని తహసీల్దార్ గుగులోతు దశరథ నాయక్ అందజేశారు. అంతేకాకుండా పూర్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను కూడా వెంటనే అందజేశారు. రిజిస్ట్రేషన్‌తోపాటు మొటేషన్ కూడా ఏకకాలంలో పూర్తి కావడంతో రైతు గణేష్ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయాబ్ తహసీల్దార్ సురేశ్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ శోభ, ఆర్ఐ వెంకట్‌రెడ్డి ఉన్నారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు : మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. గురువారం తహసీల్దార్ రామకృష్ణ మూడు రిజిస్ట్రేషన్లు చేశారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన విజయామేరి అదే గ్రామానికి చెందిన సాలమాన్ దగ్గర 22 గుంటలు, మాథ్యాస్రెడ్డి దగ్గర 4 ఎకరాలు కొనుగోలు చేశారు. మానాయికుంట గ్రామానికి చెందిన వంగూరి సోమయ్య తన కొడుకుకు గిఫ్ట్ డీడ్ ద్వారా 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడానికి బుధవారం స్లాట్ బుక్ చేసుకోగా అధికారులు శుక్రవారం రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఒక్క రోజే రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ కూడా కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఆరు రిజిస్ట్రేషన్లు పూర్తి..
సంస్థాన్‌నారాయణపురం : మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆరు స్లాట్ బుక్ చేసుకోగా గురువారం కార్యాలయంలో ఆరింటికి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తిచేసి రైతులకు ఈ పాస్‌పుస్తకాలు అందజేసినట్లు తాసీల్దార్ బ్రహ్మయ్య తెలిపారు. అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం : తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ధరణి పోర్టల్ ద్వారా రెండు రిజిస్ట్రేషన్లు నమోదు చేసి ఈ పాస్‌బుక్‌ను తహసీల్దార్ పద్మసుందరి రైతులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఐ విజయరామారావు, సునీల్, కంప్యూటర్ ఆపరేటర్ నరేశ్, శంకర్, రైతులు పాల్గొన్నారు.
ఇంత త్వరగా అవుతుందని ఊహించలేదు..
నాపేరు లాలాజీ విశాల్.. మాది హైదరాబాద్.. దేవస్థాన ప్రాంతంలో స్థలం కొనుగోలు చేయాలనుకున్నా.. మాకు తెలిసివారి నుంచి దాతారుపల్లి గ్రామంలో 27 గుంటల భూమిని కొనుగోలు చేశా. రిజిస్ట్రేషన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నా.. కానీ కాలేదు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారని, రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఇక్కడి భూములు డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతాయని చాలా మంది భయబ్రాంతులకు గురిచేశారు. మొదట భయం వేసింది. కానీ ధరణి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని విన్నాను. మొదట నాకు అర్థం కాలేదు. కానీ రిజిస్ట్రేషన్ ఇంత త్వరగా అవుతుందని ఊహించలేదు. మొదటి రోజు స్లాట్ బుక్ చేశారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ కోసం మరో రోజు సమయం ఇచ్చారు. మ్యుటేషన్, స్టాంప్, పట్టాదారు పాసుపుస్తకం, పోస్టు చార్జీలు తీసుకుని, 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసి ఈ పాసుపుస్తకం చేతిలో పెట్టారు. ధరణి వ్యవస్థ చాలా బాగుంది. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్..
మాది మోటకొండూరు మండలం కాటెపల్లి గ్రామం. మేము పచ్చిమట్ల మాధవి, వరలక్ష్మి అక్కాచెల్లండ్లము. నెల రోజుల కిందట ఆత్మకూరు(ఎం)లో 1ఎకరం భూమిని కొనుగోలు చేశాం. సీఎం కేసీఆర్ తహసీల్దార్ కార్యాలయంలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగం కలిగింది. గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోత్కూరుకు పోయేవాళ్లం. కానీ నేడు అందుబాటులో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణితో 10 నిమిషాల్లోనే ఒక్కొక్కరి పేరున చెరో 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కావడం చాలా ఆనందంగా ఉన్నది.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం