వాసాలమర్రిలో పకడ్బందీగా ఇంటింటి సర్వే

తుర్కపల్లి : ప్రభుత్వ నిబంధనలను అనుసరించి గ్రామంలో ఇంటింటి సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నేపథ్యంలో గ్రామాన్ని అబివృద్ధి పర్చేందుకు చేపట్టిన సర్వే మూడో రోజు కొనసాగింది. గురువారం వారు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే బృందాలకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, తగు మార్గదర్శకాలను వివరించారు. గ్రామంలోని 10వార్డుల్లో బృందాలు ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమగ్ర వివరాలను సేకరించారు. అధికారులు చేపట్టిన సర్వేను గ్రామ సభ నిర్వహించి చర్చిస్తారన్నారు. ఇంకా ఎవరైనా సర్వేలో మిగిలిపోయి ఉంటే గ్రామసభ నిర్ణయం మేరకు వారి వివరాలను సేకరిస్తామన్నారు.
అంకాపూర్ పర్యటనకు సన్నాహాలు
నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి ఈ నెల13, 16న గ్రామ రైతులను తీసుకువెళ్లేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామం నుంచి ఉదయం బయలుదేరి అంకాపూర్ గ్రామ సందర్శన అనంతరం అదే రోజు రాత్రి తిరిగి వచ్చే లా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామం నుంచి నాలుగువందల మంది రైతులను రెండువందల మంది మహిళలు, రెండు వందల మంది పురుష రైతులను వ్యవసాయ అధికారులు తీసుకువెళ్లనున్నా రు. రైతులను తరలించేందుకు 14 ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేస్తున్నామని ప్రత్యేకాధికారి ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్, ఉప సర్పంచ్ మధు తదితరులున్నారు.
తాజావార్తలు
- కూలి డబ్బుల కోసం ఘర్షణ.. ఒకరు మృతి
- భోజనం చేశాక ఎంత సేపటికి నీళ్లు తాగాలో తెలుసా..?
- ఈ భామకు విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేయాలనుందట..!
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!