Yadadri
- Nov 05, 2020 , 00:48:57
VIDEOS
రైల్వే అండర్‌పాస్ వద్ద నిరసన

రామన్నపేట: 20రోజులుగా వరద నిల్వ ఉండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జడ్పీటీసీ లక్ష్మి, సిరిపురం సర్పంచ్ లక్ష్మీనర్సు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సిరిపురం రైల్వే అండర్‌పాస్ వద్ద ఆగి ఉన్న వరదలో నిలబడి వారు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రం నుంచి చౌటుప్పల్‌కు వెళ్లే ప్రధాన రహదారి అయిన సిరిపురం అండర్‌పాస్ బ్రిడ్జి కింది నుంచి వేలాది వాహనాలు వెళ్తుంటాయని, నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి హరీశ్, ముత్తయ్య, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, శివగణేశ్, శంకరయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING