మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Nov 03, 2020 , 00:01:01

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

వలిగొండ: రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని అరూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ చిట్టెడి వెంకట్‌రాంరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని అరూరు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలైన గుర్నాథ్‌పల్లి, వెంకటాపురం, ముద్దాపురం, చిత్తాపురం, గోపరాజుపల్లి, అప్పారెడ్డిపల్లి, జంగారెడ్డిపల్లి, మొగిలిపాక గ్రామాల్లో చైర్మన్‌ చిట్టెడి వెంకట్‌రాంరెడ్డి ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో కంచనపల్లి, రెడ్లరేపాక, లింగరాజుపల్లి, వెల్వర్తి, ఎం.తుర్కపల్లి, వేములకొండ, దుప్పెల్లి, నర్సాపురం, నర్సాయ్యగూడెం, లోతుకుంట, నాగారం, నెమిలకాల్వ, బూర్లగడ్డ, జాలుకాల్వ, గోకారం, వర్కట్‌పల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం జాని, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లిలో... 

భూదాన్‌పోచంపల్లి : ప్రతీ రైతు పండించిన గింజను తప్పనిసరిగా కొనుగోలు చేయడంతోపాటు వారికి మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని జలాల్‌పూర్‌, మద్దివాణిగూడెం, ముక్తాపూర్‌, నారాయణగిరి, సీతవాణిగూడెం, రామలింగంపల్లి, దంతూరు గ్రామాల్లో పీఏసీఎస్‌, ఐకేసీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. వర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పోచంపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, పోచంపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశం, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి, భువనగిరి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నోముల మాధవరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సామ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవి, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo