శనివారం 06 మార్చి 2021
Yadadri - Nov 02, 2020 , 00:29:24

గ్రామీణ క్రీడాకారులను వెలికితీస్తాం..

గ్రామీణ క్రీడాకారులను వెలికితీస్తాం..

ఆలేరు : గ్రామీణ క్రీడాకారులను వెలికితీసి వారి ప్రతిభను దేశ నలమూలల చాటేందుకు తమవంతు కృషి ఉంటుందని డీసీసీబీ చైర్మన్‌, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ముదిరాజ్‌భవన్‌లో జరిగిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబడ్డీ క్రీడా పోటీలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాలని రాష్ట్ర అసోసియేషన్‌కు తెలియజేశారు. మారుమూల ప్రాంతాల్లో ఎంతో మంది పిల్లలకు క్రీడా ప్రతిభ ఉన్నా వారికి సరైన ఆదరణలేక కనుమరుగవుతున్నారని ఆవేదన వ్యక్త పరిచారు. వారిని వెలికి తీసేందుకు తమ వంతు సాకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్రస్థాయి నూతన కమిటీని నియమించారు.

కార్యవర్గ సభ్యుడిగా పూల నాగయ్య..

కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆలేరుకు చెందిన పూల నాగయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా పూల నాగయ్య మాట్లాడుతూ.. తన నియామకానికి కృషి చేసిన కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పూలెపాక అశోక్‌, జాయింట్‌ సెక్రటరీ భాస్కర్‌, కోశాధికారి గంధమల్ల కుమార్‌, అడిషినల్‌ సెక్రటరీ పూల చంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo