భువనగిరి-గజ్వేల్ రోడ్డుకు మహార్దశ

రూ.250 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ
త్వరలో పనులు ప్రారంభం
స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్
తుర్కపల్లి మండలం ముల్కలపల్లి, వాసాలమర్రిలో కాసేపు ఆగిన సీఎం
సర్పంచ్, గ్రామస్తులతో ముచ్చట
యాదాద్రి ఆలయ పనుల పురోగతిపై కలెక్టర్‌తో మాటామంతి
తుర్కపల్లి / భువనగిరి క్రైం / ఆలేరు టౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవన ప్రారంభోత్సవానికి జిల్లా మీదుగా బయలుదేరి వెళ్లారు. తుర్కపల్లి నుంచి భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తా, హౌజింగ్‌బోర్డు బైపాస్ నుంచి వరంగల్ హైవేపై ఆలేరు మీదుగా కొడకండ్లకు వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పలు గ్రామాలలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా భారీగా చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న ప్రజలకు సీఎం కేసీఆర్ కారులో నుంచి అభివాదం చేశారు. సీఎం కేసీఆర్ రాకతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉంటే తిరుగు ప్రయాణంలో తుర్కపల్లి మండలం ముల్కలపల్లి, వాసాలమర్రి గ్రామాలలో తన కాన్వాయ్‌ని నిలిపి కలెక్టర్ అనితారామచంద్రన్, సర్పంచ్ ఇమ్మడి మల్లప్ప, వాసాలమర్రి గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు.
సీఎం కేసీఆర్ : ఏం సర్పంచ్‌గారు.. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా..?
సర్పంచ్ మల్లప్ప : నమస్కారం సార్.. గోదావరి జలాలు వస్తున్నాయి సార్
సీఎం కేసీఆర్ : కొడకండ్లలో ఇచ్చిన ప్రసంగం విన్నారా..?
సర్పంచ్ : విన్నాం సార్.. చాలా బాగుంది. ఎవరూ ప్రవేశపెట్టని విధంగా రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. రైతులంతా సంతోషంగా ఉన్నారు సార్. గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు ఇబ్బంది ఉంది సార్..
సీఎం కేసీఆర్ : మీ బాధ అర్థమైంది. రూ.250 కోట్లతో భువనగిరి నుంచి గజ్వేల్ వరకు బీటీ రోడ్డు వేస్తున్నాం. త్వరలోనే పనులు మొదలవుతాయి.
సీఎం కేసీఆర్ : కలెక్టర్ గారు... యాదాద్రి ఆలయ పనులు ఎలా జరుగుతున్నాయి ?
కలెక్టర్ : ఆలయ పనులు బాగా జరుగుతున్నాయి సార్.. దాదాపు పనులు తుదిదశకు చేరుకున్నాయి.
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ ..
సీఎం కేసీఆర్ : వాసాలమర్రిలో ఉదయం ఫ్లకార్డ్‌లు ఎందుకు ప్రదర్శించారు ? ఏమి సమస్య ఉంది ?
గ్రామస్తులు : వాసాలమర్రి నుంచి కొండాపూర్ వరకు రామాలయం ముందు నుంచి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నారు సార్. ఆలయ ముందు నుంచి రోడ్డు వెళ్తుండడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉంది సార్.
సీఎం కేసీఆర్ : ఇబ్బంది పడకండి అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తా.
తాజావార్తలు
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు