గురువారం 03 డిసెంబర్ 2020
Yadadri - Oct 31, 2020 , 00:28:48

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సాయం

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సాయం

ఆలేరు : సీఎం కేసీఆర్‌ పేదింటి ఆడబిడ్డల పెండ్లీలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో అండగా ఉంటున్నారని, అదేస్ఫూర్తితో నిరుపేద, మధ్యతరగతి ఆడబిడ్డల పెండ్లిలకు పుస్తెమట్టెలను అందజేస్తున్నట్లు ఐవీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో యాదగిరిగుట్టకు చెందిన సంగీత, భానుప్రకాష్‌ వివాహానికి కావాల్సిన పుస్తెమట్టలను వారి బంధువులకు అందజేశారు. నిరుపేదలకు అండగా ఉంటున్న ఐవీఎఫ్‌ నాయకుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా సేవకు ఐవీఎఫ్‌ ఆథ్యాత్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి అంజయ్యస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.