గురువారం 03 డిసెంబర్ 2020
Yadadri - Oct 31, 2020 , 00:28:48

పట్టభద్రులు ఓటు నమోదు చేయించుకోవాలి

పట్టభద్రులు ఓటు నమోదు చేయించుకోవాలి

ఆత్మకూరు(ఎం) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని టీఆర్‌ఎస్‌ బీసీసెల్‌ మండల ప్రధానకార్యదర్శి తవిటి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు ఓటరు నమోదు పత్రాలు అందజేశారు. పట్టభద్రులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం మండల నాయకురాలు తవిటి లక్ష్మి తదితరులు ఉన్నారు.

గుండాలలో..

గుండాల : పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకోవాలని మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తున్నారన్నారు. పట్టభద్రులు, మేధావులు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమన్నారు.