బుధవారం 25 నవంబర్ 2020
Yadadri - Oct 31, 2020 , 00:28:48

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఆత్మకూరు(ఎం) : భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్‌ కార్యాలయంలోనే చేసే విధంగా ధరణి పోర్టల్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండలంలోని పల్లెర్లలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలువాలని సర్పంచ్‌ నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ కోరె భిక్షపతి, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు లోడి రాజేందర్‌గౌడ్‌, పెసరుకాయల నర్సింహారెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, జహంగీర్‌, మధుసూదన్‌రెడ్డి, వెంకన్న, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.