శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 29, 2020 , 02:08:16

పనిచేసే వారికి తప్పక గుర్తింపు

పనిచేసే వారికి తప్పక గుర్తింపు

  • టీఆర్‌ఎస్‌లో ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం.. 
  • ప్రభుత్వ పథకాలు చివరి పేద వరకు చేరాలి 
  • దేవుడి దయతో నియోజకవర్గంలో చెరువులు జలకళ 
  • యాదాద్రి పునర్నిర్మాణంతో ప్రపంచ ఖ్యాతి
  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

‘టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుంది. పార్టీలో ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తాం. పార్టీ అభివృద్ధితోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి పేద వరకు చేరాలి. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మనది. నూతన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం రైతులకు అండగా నిలువాలి. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారి పంటలకు మద్దతు ధర లభించేలా చూడాలి’ అని ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీత సూచించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నాగరాజుతోపాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 


ఆలేరు టౌన్‌ : పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి సరైన గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరు మార్కెట్‌ యార్డులో బుధవారం మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో కూడా శక్తివంచన లేకుండా రవీందర్‌ పని చేశారని కొనియాడారు.  సీఎం కేసీఆర్‌  రైతుల పక్షపాతిగా పని చేస్తున్నారని గుర్తుచేశారు. నియోజకవర్గాన్ని ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానన్నారు.  యాదాద్రికి  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతో ఇక్కడి భూముల ధరలు పెరిగాయన్నారు. డీసీసీబీ  చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కష్టపడే యువతకు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో పీఏసీఎస్‌లల్లో సుమారు రూ.16కోట్లతో రైతులకు రుణాలు అందించడం జరిగిందన్నారు.

 నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవులు కట్టబెట్టారని,  నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. అంతకు ముందు పాలకేంద్రం నుంచి మార్కెట్‌ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో నూతన డైరెక్టర్లు మామిడాల నర్సింహులు, జంగారెడ్డి, బొద్దు నాయక్‌, మంజుల, అయిలయ్య, కృష్ణ, సత్యనారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, అల్టా చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్లు  మొగులగాని మల్లేశం, చింతకింద చంద్రకళ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బికునాయక్‌, మోత్కూరు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్వాతి, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌, మొరిగాడి వెంకటేశ్‌, బేతి రాములు, చింతలపురి వెంకట్‌రాంరెడ్డి, లింగాల శ్రీకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, జూకంటి శ్రీకాంత్‌, కందుల శ్రీకాంత్‌, మోర్తల సునీత, బింగి లత, డాక్టర్‌ చింతకింది మురహరి, గడ్డమీది స్వప్న, కర్రె వెంకటయ్య, సుమలత, శ్రీను, కృష్ణ, ఆడెపు బాలస్వామి, పుట్ట మల్లేశం, ఇల్లందుల మల్లేశం  పాల్గొన్నారు. 

అందుబాటులో ఉండేందుకే క్యాంపు కార్యాలయాలు 

ఆలేరు టౌన్‌: ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసిందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరులో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బుధవారం ప్రభుత్వ విప్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి దంపతులు ప్రారంభించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాంపు కార్యాలయాలు పూర్తయినందున ప్రజలను నిరంతరం కలుసుకొని వారి సమస్యలు తెలుసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు వివిధ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు గడ్డమీది రవీందర్‌గౌడ్‌, గ్యాదపాక నాగరాజు, మొరిగాడి వెంకటేశ్‌, చింతకింది మురళి, బేతి రాములు, దాసి నాగమణిసంతోష్‌, రాయపురం నర్సింహులు, బెంజారం రవి, కందుల రామన్‌, బింగి రవి, కోటగిరి ఆంజనేయులు, జల్లి నర్సింహులు, ఎండీ ఫయాజ్‌, పాశికంటి శ్రీనివాస్‌, మామిడాల భాను, కేమిడి సిద్ధేశ్వర్‌, రియాజ్‌, సీస రాజేశ్‌, మహమూద్‌, కోనపురం నాగరాజు, పూల శ్రవణ్‌, చామకూర అమరేందర్‌రెడ్డి, జూకంటి ఉప్పలయ్య ఆరె రాములు, నీల రామన్న పాల్గొన్నారు.